OTTలోకి వచ్చేసిన ‘కల్కి 2898 AD’ .. కానీ నిరాశ చెందుతున్న ఫ్యాన్స్

Kalki 2898AD Movie OTT Streaming: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. కానీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు మాత్రం కాస్త నిరాశ ఎదురైంది. అసలు విషయం ఏంటో చూసేద్దాం.

Kalki 2898AD Movie OTT Streaming: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. కానీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు మాత్రం కాస్త నిరాశ ఎదురైంది. అసలు విషయం ఏంటో చూసేద్దాం.

ప్రతి వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలకంటే.. ఈ వారం ఓటీటీ లోకి వచ్చిన సినిమాలు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలు చాలా స్పెషల్ . ఎందుకంటే ఈ వారం ఓటీటీ లో థియేటర్స్ లో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాలు వచ్చేస్తున్నాయి. అవే ప్రభాస్ నటించిన కల్కి , ధనుష్ నటించిన రాయన్. ఆల్రెడీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా.. కల్కి 2898AD మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ ఇక్కడ మాత్రం అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కల్కి 2898AD మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా గురించి కథలు కథలుగా విన్నాము. అలాగే ఈ సినిమాలోని కథ గురించి కూడా అంతే శ్రద్దగా తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు ప్రేక్షకులు. ఇదంతా బాగానే ఉంది. ఆల్రెడీ ఈ మూవీ ఓటీటీ లోకి కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు అభిమానులను నిరాశ పరిచిన మ్యాటర్ ఏంటంటే.. కల్కి మూవీ ఒరిజినల్ వెర్షన్ రన్ టైమ్ 3 గంటల 1 నిమిషం.. కానీ ఓటీటీ లో మాత్రం దానిని 2 గంటల 55 నిమిషాలకు ట్రిమ్ చేసి.. స్ట్రీమింగ్ చేస్తున్నారు. అంటే కొన్ని సీన్స్ ను కట్ చేశారు మేకర్స్. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు కాస్త అప్ సెట్ అవుతున్నారు.

మరి ఆ కట్ చేసిన సీన్స్ ఏంటో చూసేద్దాం.. ప్రభాస్ ఎంట్రీ సీన్ ను కొంచెం ట్రిమ్ చేశారు. ఓ ముసలావిడా, విలన్ గ్యాంగ్ లోని ఓ వ్యక్తి ప్రభాస్ ను కప్పా అంటూ కామెంట్ చేసే ఓ సీన్ , టా టక్కర’ సాంగ్‌లోని బీచ్ సీన్స్‌ , ఇంట్రడక్షన్ ఫైట్ లో ఓ సీన్, కాంప్లెక్స్ నుంచి ఆయనను బయటకు గెంటేసే సీన్స్ ను ట్రిమ్ చేశారు. అయితే ఇంటర్వెల్ లో దీపిక మంటల్లో నడుస్తూ వస్తున్న సీన్ లో మాత్రం కొత్త లిరిక్స్ ను యాడ్ చేశారు. సో మొత్తానికి కల్కి సినిమా కంప్లీట్ థియేటర్ వెర్షన్ అయితే ఓటీటీ లోకి రాలేదనే చెప్పాలి. మరి కంప్లీట్ వెర్షన్ ను రిలీజ్ చేస్తారో లేదో అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు కాబట్టి.. ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments