iDreamPost
android-app
ios-app

OTTలో దూసుకెళ్తున్న ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్.. ఇప్పుడే చూసేయండి..

  • Published Sep 01, 2024 | 1:30 AM Updated Updated Sep 01, 2024 | 1:30 AM

IC814 Kandahar Hijack Series Trending In Netflix: కొన్ని సినిమాలు , సిరీస్ లు ఈ మధ్య కాలంలో ఇలా స్ట్రీమింగ్ కు వస్తున్నాయో లేదో.. అలా ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి వచ్చిన సిరీస్ అప్పుడే టాప్ 1 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఏంటో ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

IC814 Kandahar Hijack Series Trending In Netflix: కొన్ని సినిమాలు , సిరీస్ లు ఈ మధ్య కాలంలో ఇలా స్ట్రీమింగ్ కు వస్తున్నాయో లేదో.. అలా ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి వచ్చిన సిరీస్ అప్పుడే టాప్ 1 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఏంటో ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Sep 01, 2024 | 1:30 AMUpdated Sep 01, 2024 | 1:30 AM
OTTలో దూసుకెళ్తున్న ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్.. ఇప్పుడే చూసేయండి..

ప్రేక్షకులు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ చుపిస్తున్నారో.. ట్రెండింగ్ లోకి వచ్చే లిస్ట్ ను బట్టి చెప్పేయొచ్చు. ఎందుకంటే కొన్ని సినిమాలు , సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలా ట్రెండింగ్ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ ల జాబితా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన “ఐసీ 814: ది కాందహార్ హైజాక్” అనే వెబ్ సిరీస్ టాప్ 1 ట్రెండింగ్ లోకి రావడం విశేషం. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఈ సిరీస్ కథేంటి .. ఈ సిరీస్ ను ఎందుకు చూడాలి అనే విషయాలను చూసేద్దాం.

నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందించిన సిరీస్.. ఈ “ఐసీ 814: ది కాందహార్ హైజాక్”. ఈ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా మూడు రోజుల్లోనే ఈ మూవీ టాప్ 1 ట్రెండింగ్ లోకి రావడం విశేషం. సాధారణంగా గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరికి ఉంటుంది. అదే క్యూరియాసిటీ ప్రేక్షకులను.. ఈ సిరీస్ చూసేలా చేస్తుంది. ఈ సిరీస్ లో కూడా డిసెంబర్ 24, 1999లో దేశంలో ఓ భయంకరమైన ఫ్లైట్ హైజాక్ జరిగింది. మన దేశ చరిత్రలోనే ఇదొక డార్క్ డే అనే ప్రచారం కూడా ఉండేది. కాబట్టి ఈ సిరీస్ ను ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి తీరాల్సిందే. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఈ సిరీస్ ఎవరైనా చూడకపోతే కనుక వెంటనే చూసేయండి.

ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే..1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్ లైన్స్ IC814 అనే విమానం.. కాఠ్‌మాండూ నుంచి లఖ్‌నవూకు స్టార్ట్ అయింది. ఆ విమానంలో మొత్తం 176 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో ఒక 5 గురు ముసుగులు ధరించిన ఉగ్రవాదులు ఫ్లైట్ ను హైజాక్ చేశారు. దానిలో ఒక అతను విమానాన్ని.. లాహోర్ కు తీసుకుని వెళ్లాలని లేదంటే.. వెంటనే విమానాన్ని బాంబుతో పేల్చేస్తామని.. పైలెట్ ను బెదిరిస్తాడు. దీనితో ప్రయాణికులంతా భయాందోళనతో వణికిపోతారు. ఈ క్రమంలో కెప్టెన్ శరణ్ దేవ్ దైర్యంగా ముందు అడుగు వేసి.. ఆ ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ ఫ్లైట్ హైజాక్ మొత్తం కూడా ఏడు రోజుల పాటు కొనసాగింది. ఆ ఏడు రోజులు వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ? కెప్టెన్ ప్రయాణీకులను కాపాడాడా లేదా ?ఆ తర్వాత ఏమైంది ? అనేదే తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.