iDreamPost
android-app
ios-app

OTT Movie : OTT లోకి మరో కొరియన్ హర్రర్ థ్రిల్లర్.. తెలుగులో కూడా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jul 01, 2024 | 11:58 AM Updated Updated Jul 01, 2024 | 11:58 AM

OTT Korean Horror Movie In Telugu: హర్రర్ సినిమాలంటే అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఈరోజుల్లో... మేకర్స్ కూడా సరికొత్తగా ప్లాన్ చేస్తూ... ఎప్పటివో సినిమాలను కూడా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

OTT Korean Horror Movie In Telugu: హర్రర్ సినిమాలంటే అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఈరోజుల్లో... మేకర్స్ కూడా సరికొత్తగా ప్లాన్ చేస్తూ... ఎప్పటివో సినిమాలను కూడా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

  • Published Jul 01, 2024 | 11:58 AMUpdated Jul 01, 2024 | 11:58 AM
OTT Movie : OTT లోకి మరో కొరియన్ హర్రర్ థ్రిల్లర్.. తెలుగులో కూడా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

హర్రర్ సినిమాలంటే అందరికి హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలే గుర్తొస్తూ ఉంటాయి. కానీ కొరియన్ భాషలో కూడా మంచి మంచి హర్రర్ సినిమాలు , సిరీస్ లు ఉన్నాయి. ఇక కొరియన్ సినిమాలు , సిరీస్ లు ఈ మధ్య ప్రేక్షకులను ఏ రేంజ్ లో అట్ట్రాక్ట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కే డ్రామాస్ అంటే అందరికి గుర్తొచ్చేది.. లవ్ , రొమాన్స్ జోనర్ సినిమాలు , సిరీస్ లే.. కానీ వాటితో పాటు కే డ్రామాస్ లో.. హర్రర్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇక ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా ఏడేళ్లకు ఓటీటీ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ప్రస్తుతం ఓటీటీ లో కొరియన్ కంటెంట్ కు బాగా డిమాండ్ ఉందని చెప్పి తీరాలి. ఎన్ని చూసినా కానీ ఇంకా ఇంకా మిగిలే ఉంటాయి. ఈ క్రమంలో తాజగా “హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్” అనే మూవీ ఓటీటీ లోకి వచ్చింది. ఈ సినిమా కొరియన్ థియేటర్స్ లో 2017 లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ సినిమాకు మంచి పాపులారిటీ దక్కింది. ఇక హర్రర్ లో సైకలాజికల్ థ్రిల్లర్స్ కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలియనిది కాదు. ఈ సినిమా కూడా ఇలాంటిదే. ఇక ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ఏకంగా ఏడేళ్ల తర్వాత ఓటీటీ లో రిలీజ్ చేశారు మేకర్స్. పైగా ఈ సినిమా కొరియన్ తో పాటు.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉన్న వారు.. వెంటనే ఈ సినిమాను చూసేయండి.

కాగా.. హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీకి డీ ఊంగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. మీ హీ అనే మహిళ భర్త, కొడుకును హత్య చేసింది.. అనే తప్పుడు ఆరోపణ కారణంగా.. 25 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆమె తన జైలు శిక్షను పూర్తి చేసుకుని.. బయటకు వచ్చి తన ఇంటికి తిరిగి వెళ్తుంది. నిజానికి ఆమె భర్త, కొడుకు చనిపోయింది ఆమె వలన కాదని ఆమెకు మాత్రమే తెలుసు. దీనితో అసలు ఆ జరగడానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి ! ఆమె ఈ హత్యల వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలను బయట పెట్టిందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.