iDreamPost
android-app
ios-app

OTT లో ఇంట్రెస్టింగ్ హర్రర్ థ్రిల్లర్ ‘కంగారు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 18, 2024 | 11:00 PM Updated Updated Aug 18, 2024 | 11:00 PM

OTT Horror Suspense Thriller: ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Horror Suspense Thriller: ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 18, 2024 | 11:00 PMUpdated Aug 18, 2024 | 11:00 PM
OTT లో ఇంట్రెస్టింగ్ హర్రర్ థ్రిల్లర్ ‘కంగారు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

భాషా బేధం లేకుండా ఓటీటీ లో వచ్చిన సినిమాలను వచ్చినట్లు చూసేస్తూ ఉన్నారు. కథను బట్టి ఆయా సినిమాలను మంచి ఆదరణ కూడా లభిస్తూనే ఉంది. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. పైగా ఆ సినిమాలు మంచి వ్యూస్ ను కూడా దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు ‘కంగారూ’. ఇది ఒక కన్నడ సినిమా. మే లో థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమాకు 8.1 రేటింగ్ దక్కింది. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా.. ప్రతి సీన్ ట్విస్ట్స్ తో ఉండడంతో ప్రేక్షకులను మరింత మెప్పించేసింది. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా మూడు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఈ మూవీ కన్నడలోనే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే తెలుగులో కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఇక కంగారు సినిమా కథ విషయానికొస్తే.. పృథ్వి అనే అతను… చిక్ మంగళూరు స్టేషన్ కు ట్రాన్స్ఫర్ మీద వస్తాడు. అతను వచ్చిన కొద్దీ రోజులకే.. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆంటోనీ గెస్ట్ హౌస్ లో వరుసగా అనుమానాస్పద హత్యలు జరుగుతూ ఉంటాయి. పైగా ఆ గెస్ట్ హౌస్ లో అడుగుపెట్టిన 125 మంది కనిపించకుండా పోతారు. దీనితో ఈ కేసును పృథ్వి టెక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ లో ఆ గెస్ట్ హౌస్ లోకి వెళ్లిన వారు.. కొంతమంది చనిపోయారని.. మరికొంతమంది మిస్ అయ్యారని.. ఇలా రకరకాల విషయాలు బయటపడతాయి . ఆ గెస్ట్ హౌస్ లో ఉండే ఓ దెయ్యమే ఇదంతా చేస్తుందనే పుకార్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ కేసును పృథ్వి ఎలా ఛేదించాడు అనేదే మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.