Swetha
Munjya Telivison Premier :థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా సరే ఓటీటీ లోకి రావాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హర్రర్ కామెడీ మూవీ.. మాత్రం ఓటీటీ కంటే ముందే టీవీ ప్రీమియర్స్ కు రెడీ అయిపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Munjya Telivison Premier :థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా సరే ఓటీటీ లోకి రావాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హర్రర్ కామెడీ మూవీ.. మాత్రం ఓటీటీ కంటే ముందే టీవీ ప్రీమియర్స్ కు రెడీ అయిపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
కామెడీ హర్రర్ సినిమాలు ఎన్ని చూసినా కానీ అసలు బోర్ కొట్టవు. పైగా ఈ జోనర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నారు. ఇలాంటి సినిమాలు ఓటీటీ లో ఎన్ని ఉన్నా కూడా.. ఇంకా ఏమైనా కొత్త సినిమాలు వస్తాయేమో అని చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక థియేటర్స్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలో ఇటీవల థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన.. హర్రర్ కామెడీ మూవీ ‘ముంజ్యా’ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ రెండు మూడు స్ట్రీమింగ్ తేదీలు వినిపించినా కానీ. ఇంకా స్ట్రీమింగ్ కు రాలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ కంటే ముందే టీవీ ప్రీమియర్స్ కు రెడీ అయిపొయిందట. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేసిన ముంజ్యా మూవీ.. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న థియేటర్ లో అడుగుపెట్టింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఊహించని విధంగా రూ.132 కోట్లు వసూళ్లు చేసింది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చి.. కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా.. ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈలోపే ఈ సినిమా ఆగస్టు 24 నుంచి టీవీ ప్రీమియర్స్ కు రెడీ అయిపోతుంది. స్టార్ గోల్డ్ ఛానల్ లో ‘ముంజ్యా’ మూవీ ప్రసారం కానుంది. ఓటీటీ లో కాకుండా ఈ మూవీ ముందుగా టీవీ ప్రీమియర్స్ కు రావడం అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ముంజ్యా అనేది మరాఠీ భాషకు చెందిన పదం.. ముంజ్యా అంటే ఉపనయనం అనే అర్ధం వస్తుంది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఉండే మగపిల్లలకు కౌమార దశలో వేదాభ్యాసానికి ముందు..ఇలా ఉపనయనం చేయడాన్ని మరాఠిలో ముంజ్యా అని పిలుస్తారు. ఇలా ఉపనయనం చేస్తున్న క్రమంలో ఓ పిల్లవాడు దెయ్యంగా మారిపోతాడు. అయితే ఈ దెయ్యం కేవలం పిల్లలకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్ల దెయ్యం ఓ వైపు భయపెడుతూనే.. మరో వైపు నవ్విస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోకు మాత్రమే ఈ పిల్ల దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత హీరోకు ఈ పిల్ల దెయ్యంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.