iDreamPost
android-app
ios-app

OTTలోకి టాప్‌ దర్శకుడి కుమారుడి ఫస్ట్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

  • Published Jul 05, 2024 | 10:54 AM Updated Updated Jul 05, 2024 | 10:56 AM

Hit List Movie: ప్రముఖ దర్శకుడి కుమారుడు తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

Hit List Movie: ప్రముఖ దర్శకుడి కుమారుడు తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Jul 05, 2024 | 10:54 AMUpdated Jul 05, 2024 | 10:56 AM
OTTలోకి టాప్‌ దర్శకుడి కుమారుడి ఫస్ట్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

శుక్రవారం వచ్చిందంటే చాలు మూవీ లవర్స్‌.. ఓటీటీల్లోకి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గతంలో అయితే ఫ్రైడే వస్తే..  థియేటర్‌లో రిలీజ్‌ కాబోయే సినిమాల కోసం ఆత్రుతగా వెయిట్‌ చేసేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. థియేటర్‌లో రిలీజైన ప్రతి చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుండగా.. కొన్ని నేరుగా ఓటీటీల్లోనే స్ట్రీమ్‌ అవుతున్నాయి. ఈక్రమంలో ప్రముఖ దర్శకుడి కుమారుడు నటించిన తొలి సినిమా.. ఒకటి ఓటీటీల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. థియేటరల్లలో  విడుదలైన నెల రోజుల తర్వాత.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది వంటి వివరాలు..

ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ తన ఆర్కే సెల్యులాయిడ్స్‌ పతాకంపై తాజాగా ‘హిట్‌ లిస్ట్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో నటుడు శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో మెప్పించారు. అయితే ఈ మూవీలో కోలీవుడ్‌ టాప్‌ దర్శకుడు విక్రమన్‌ కుమారుడు విజయ్‌ కనిష్క హీరోగా నటించాడు. హిట్‌ లిస్ట్‌ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు విక్రమన్‌. ఈ మూవీకి రవికుమార్‌ శిష్యులు సూర్య, కార్తికేయన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా మే 31న థియేట‌ర్ల‌లో విడుదలైంది. తెలుగు, త‌మిళంలో ఒకే రోజు విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు. ఇక హిట్‌ లిస్ట్‌ విడుదలయ్యి ఇప్పటికే నెల రోజులకు పైగా అవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్‌ వివరాలు వెల్లడిస్తూ.. అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్‌లిస్ట్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూలై 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు,తమిళ్‌ రెండూ భాషల్లో ఒకే రోజు రానుంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, సముద్ర ఖని, మునీశ్కాంత్‌, నటి సితార, కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్‌ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.

 

View this post on Instagram

 

A post shared by aha Tamil (@ahatamil)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio