iDreamPost
android-app
ios-app

మరోసారి వైరల్ అవుతున్న హీరామండి.. అవార్డుల రేసులో దూకుడు!

  • Published Aug 30, 2024 | 12:39 PM Updated Updated Aug 30, 2024 | 12:39 PM

Heeramandi: The Diamond Bazaar Web Series Nominated For International Film Festival 2024: డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ వెబ్ సిరీస్ లకు పెట్టింది పేరు. ఇలా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ లలో కొన్ని వెబ్ సిరీస్ లు ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ అయినా హీరామండికి ఓ స్పెషల్ అవార్డ్స్ కు నామినేట్ అయినట్లు సమాచారం.

Heeramandi: The Diamond Bazaar Web Series Nominated For International Film Festival 2024: డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ వెబ్ సిరీస్ లకు పెట్టింది పేరు. ఇలా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ లలో కొన్ని వెబ్ సిరీస్ లు ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ అయినా హీరామండికి ఓ స్పెషల్ అవార్డ్స్ కు నామినేట్ అయినట్లు సమాచారం.

  • Published Aug 30, 2024 | 12:39 PMUpdated Aug 30, 2024 | 12:39 PM
మరోసారి వైరల్ అవుతున్న హీరామండి.. అవార్డుల రేసులో దూకుడు!

సినిమాలకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా వెబ్ సిరీస్ లను చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు డిమాండ్ బాగా పెరిగిన తర్వాత.. వెబ్ సిరీస్ ల క్రేజ్ కూడా బాగా పెరిగింది. ప్రతి వారం ఎదో ఒక కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంది. అంతే కాకుండా కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. సొంతంగా వెబ్ సిరీస్ లను రూపొందిస్తు ఉంటాయి. అవి ఇంకాస్త స్పెషల్ గా అందరిని ఇంప్రెస్స్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ గా రిలీజ్ అయినా.. భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరమండి గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ ను అందరు చూసేసి ఉంటారు. అయితే తాజాగా ఈ సిరీస్ స్పెషల్ ఓ స్పెషల్ అవార్డ్స్ కు నామినేట్ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో… మేకర్స్ కూడా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి అదే రేంజ్ లో వెబ్ సిరీస్ లను చిత్రీకరిస్తున్నారని చెప్పడానికి… బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తీసిన హీరమండి వెబ్ సిరీస్ ఏ ఉదాహరణ. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ రూపొందించడానికి.. ఓ భారీ బడ్జెట్ సినిమాకు కేటాయించేంత బడ్జెట్ ను కేటాయించారట. ఏకంగా రూ.200 కోట్లు బడ్జెట్ తో రూపొందించిన ఈ సిరీస్. మే 1 నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. స్ట్రీమింగ్ కు వచ్చిన కొద్దీ గంటల్లోనే భారీ వ్యూస్ ను కూడా దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ ఏషియన్ కంటెంట్ అవార్డ్స్ , గ్లోబల్ ఓటీటీ 2024 అవార్డ్స్ అవార్డ్స్ కు .. బెస్ట్ ఓటీటీ ఒరిజినల్ , బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘సకల బనా’ క్యాటగిరిలో నామినేట్ అయినట్లు.. నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇలాంటి భారీ బడ్జెట్ సిరీస్ కు కచ్చితంగా అవార్డు దక్కి తీరాల్సిందే మరి.

ఈ సిరీస్ మేకింగ్ లో ప్రతి విజువల్ కూడా ఎంతో అద్భుతంగా రూపొందించారు మేకర్స్. పైగా ఈ సిరీస్ లో నటి మనీషా కొయిరాలాతోపాటు సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ లాంటి ఎంతో మంది నటి నటులు ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సిరీస్ ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఇక ఆ తర్వాత హీరమండి వెబ్ సిరీస్ కు రెండవ సీజన్ కు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇంకా ఎవరైనా ఈ సిరీస్ చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.