Krishna Kowshik
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీలకు ఆదరణ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వీటికి ఓటీటీలో స్కోప్ పెరిగింది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల కోసం అలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీలకు ఆదరణ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వీటికి ఓటీటీలో స్కోప్ పెరిగింది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల కోసం అలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు
Krishna Kowshik
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అదీ మూవీస్ అయినా, సిరీస్ అయినా. మధ్యతరగతి కుటుంబంలోని కష్ట నష్టాలను, దు:ఖాన్ని, సంతోషాలను, వారి మధ్య రిలేషన్స్, భావోద్వేగాలను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల తెలుగులో ఈ జోనర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. అంతేకాకుండా డబ్బింగ్ రూపంలో కూడా కొన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇవి కేవలం ఎమోషన్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మూడు సీజన్లు రాగా, ఇప్పుడు నాలుగో సీజన్ ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు వచ్చేసింది.
ఓ మధ్య తరగతి కుటుంబం. భార్యా భర్త..వారి ఇద్దరు పిల్లల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించే వెబ్ సిరీస్సే గుల్లక్. ఇప్పటి వరకు మూడు సీజన్లు రాగా..ఇవన్నీ సక్సెస్ పొందాయి . ఇప్పుడు నాలుగో సీజన్ వచ్చేసింది. ది వైరల్ ఫీవర్ (TVF) బ్యానర్‌పై శ్రేయాన్ష్ పాండే ఈ సిరీస్‌ని రూపొందించారు. గుల్లక్ సీజన్ 4 ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 7న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ఇది సోనీలైవ్‌లో కాస్త ముందుగానే స్ట్రీమింగ్ అవుతుంది. కాగా, ఈ సిరీస్ ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీతో సహా పలు భాషల్లో చూడవచ్చు. ఇందులో విశేషమేమిటంటే.. ఇంట్లో హాయిగా అందరూ కూర్చుని చూడగలిగే వెబ్ సిరీస్.
ఈ ధారావాహికలో జమీల్ ఖాన్, గీతాంజలి కులకర్ణి, వైభవ్ రాజ్ గుప్తా, హర్ష్ మాయర్, సునీతా రాజ్వార్, సాద్ బిల్గ్రామి మరియు దీపక్ కుమార్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. ఇక కథ విషయానికి వస్తే.. మిశ్రా కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఆయన భార్య.. ఇద్దరు పిల్లలు. ప్రతి ఇంట్లోలా వీరి మధ్య సమస్యలు.. వాటిని ఎలా ఎదుర్కొన్నారు. ఇదే సిరీస్ ప్లాట్. ఇటీవల నాల్గవ సీజన్ ట్రైలర్ చూడగానే.. మరోసారి భావోద్వేగాలతో కట్టిపడేసింది. ఇప్పటి వరకు మూడు సీజన్లు వస్తే.. మూడింటిని ఆదరించారు ప్రేక్షకులు. తదుపరి సీజన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటున్నారు. 2019లో గుల్లక్ సీజన్ 1 స్టార్ అయిన దగ్గర నుండి మూడు సీజన్ల వరకు విపరీతమైన వ్యూస్ వచ్చాయి. ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే కథ కావడంతో దీన్ని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. మరీ ఇంకెందుకు ఆలస్యం.. ఈ సీజన్ 4 కూడా చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.