iDreamPost
android-app
ios-app

Godzilla Minus One OTT: సైలెంట్ గా OTT లోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ .. ఎక్కడ చూడాలంటే !

  • Published Jun 01, 2024 | 5:32 PM Updated Updated Jun 01, 2024 | 5:32 PM

కేవలం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలే కాకుండా కొరియన్, జాపనీస్ చిత్రాలను చూడడానికి కూడా ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గాడ్జిల్లా మైనస్ వన్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

కేవలం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలే కాకుండా కొరియన్, జాపనీస్ చిత్రాలను చూడడానికి కూడా ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గాడ్జిల్లా మైనస్ వన్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

  • Published Jun 01, 2024 | 5:32 PMUpdated Jun 01, 2024 | 5:32 PM
Godzilla Minus One OTT: సైలెంట్ గా OTT లోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ .. ఎక్కడ చూడాలంటే !

నిత్యం ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తున్నా సరే.. ప్రేక్షకులు మాత్రం కొన్ని సినిమాలు ఓటీటీ లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అదే “గాడ్జిల్లా మైనస్ వన్” ఈ సినిమా గత ఏడాది జపాన్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా , జర్మనీ , ఫ్రాన్స్ సహా మరి కొన్ని దేశాల్లో రిలీజ్ అయింది. కానీ ఇండియాలో మాత్రం ఈ సినిమా ఏ థియేటర్స్ లోను రిలీజ్ అవ్వలేదు. ఈ క్రమంలో ఇండియన్ మూవీ లవర్స్ అంతా కూడా కనీసం ఓటీటీ లో అయినా ఈ సినిమాని చూడాలని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా సైలెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

గత నెలలోనే ఈ సినిమాను ఓటీటీ లోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేశారు మేకర్స్. దాని గురించి వార్తలు కూడా విన్నాము కానీ ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ మాత్రం ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా సైలెంట్ గా ఎటువంటి హడావిడి లేకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులంతా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేసేయండి. ప్రస్తుతానికి తెలుగు భాషలో అయితే ఈ సినిమా లేదు కానీ.. జాపనీస్ తో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మధ్య ఎలాగూ కొన్ని సినిమాలపైన ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి ఆయా సినిమాలను సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి చూస్తున్నారు కాబట్టి.. ఈ సినిమా చూసేందుకు అంతగా ఇబ్బంది ఉండదు.

ఇక గాడ్జిల్లా మైనస్ వన్ సినిమా కథ విషయానికొస్తే.. దాదాపు 12 మిలియన్ డాలర్స్ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఇక ఈ మూవీ విడుదల తర్వాత ప్రపంచంలోని వివిధ దేశాల్లో కలెక్షన్స్ విషయంలో ఈ సినిమాపై కాసుల వర్షం కురిసింది. పైగా విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో గాడ్జిల్లా మైనస్ వన్ మూవీకి ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. 2023 లో విడుదలైన బెస్ట్ జాపనీస్ మూవీ అంటూ ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ నుంచి ఎటువంటి ప్రశంసలు దక్కించుకుంటుందో వేచి చూడాలి. గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రం.. రెండవ ప్రపంచ యుద్ధం కాలం అంటే 1945 నాటి పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో రూపొందించారు. జపాన్ లో జరిగిన ఓ భారీ యుద్ధం తర్వాత.. గాడ్జిల్లా భూమిపైకి రావడం వలన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.