iDreamPost
android-app
ios-app

Getup Srinu: ఆ OTTలోకి గెటప్‌ శ్రీను ఎమోషనల్‌ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్‌ వివరాలివే..!

  • Published Jul 09, 2024 | 9:45 AM Updated Updated Jul 09, 2024 | 9:58 AM

గెటప్‌ శ్రీను సోలో హీరోగా వచ్చిన చిత్రం ఓటీటీల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.. ఎప్పటి నుంచి అనే వివరాలు మీకోసం..

గెటప్‌ శ్రీను సోలో హీరోగా వచ్చిన చిత్రం ఓటీటీల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.. ఎప్పటి నుంచి అనే వివరాలు మీకోసం..

  • Published Jul 09, 2024 | 9:45 AMUpdated Jul 09, 2024 | 9:58 AM
Getup Srinu: ఆ OTTలోకి గెటప్‌ శ్రీను ఎమోషనల్‌ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్‌ వివరాలివే..!

జ‌బ‌ర్దస్త్‌ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏళ్లకు ఏళ్లుగా బుల్లి తెర మీద కామెడీ పండిస్తూ ముందుకు సాగుతుంది ఈ షో. ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ కావడం మాత్రమే కాక.. ఇండస్ట్రీలోకి ఎందరో కొత్త కమెడియన్ల ఎంట్రీకి దారి చూపింది. జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఎందరో నేడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కొందరు కమెడియన్లుగా చేస్తుండగా.. మరి కొందరు ఏకంగా హీరోలుగా మారుతున్నారు. జబర్దస్త్‌ ద్వారా.. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత సినిమాల్లో రాణిస్తున్న ఆర్టిస్ట్‌ గెటప్‌ శ్రీను.

కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గెటప్‌ శ్రీను.. హీరోగా మారిన సంగతి తెలిసిందే. అతడు హీరోగా న‌టించిన చిత్రం రాజు యాదవ్‌. ఈ ఏడాది మే నెలలో థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన మేర రాణించలేదు. అదలా ఉంచితే త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. రాజు యాదవ్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తికర అప్డేట్‌ వచ్చింది. ఆ వివరాలు..

గెటప్‌ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్‌ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ ఎమోష‌న‌ల్ కామెడీ మూవీ ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రాజు యాద‌వ్ ఓటీటీ రిలీజ్‌ను ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను పోస్ట్ చేసింది. త్వ‌ర‌లోనే రాజు యాద‌వ్ మూవీ విడుద‌ల కానున్న‌ట్లు ఈ పోస్ట‌ర్‌లో వెల్ల‌డించింది. అయితే స్ట్రీమింగ్‌ తేదీ ఎప్పటి నుంచి అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

ఇక రాజు యాద‌వ్ సినిమాలో గెట‌ప్ శ్రీనుకు జోడీగా అంకితా ఖార‌త్ హీరోయిన్‌గా న‌టించింది. ఆనంద చ‌క్ర‌పాణి, రాకెట్ రాఘ‌వ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మే నెల‌లో రాజు యాద‌వ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాలో కామెడీతో పాటు ఎమోష‌న్స్ చ‌క్క‌గా ప‌డించాడు గెట‌ప్ శ్రీను. కానీ రోటిన్‌ కథ కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌లో క్లారిటీ లేక‌పోవ‌డం, క‌థ‌కు సంబంధం లేని బోల్డ్ సీన్స్ కార‌ణంగా సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.

గెట‌ప్ శ్రీనుకు సోలో హీరోగా రాజు యాద‌వ్ ఫ‌స్ట్ మూవీ. గ‌తంలో త్రీమంకీస్ సినిమాలో సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్‌ల‌తో క‌లిసి హీరోగా చేశాడు. ప్రస్తుతం క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా గెట‌ప్ శ్రీను బిజీగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్‌, హ‌నుమాన్‌, ఆచార్య‌, జాంబీరెడ్డితో పాటు ప‌లు సినిమాల్లో త‌న కామెడీ టైమింగ్‌తో న‌వ్వించాడు. వీటితో పాటు మా ఊరి పొలిమేర‌, పొలిమేర 2 సినిమాల్లో ప్రాధాన పాత్రల్లో నటించాడు. వీటితో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మాయ‌బ‌జార్ ఫ‌ర్ సేల్ వెబ్‌సిరీస్‌ల‌లో నటించాడు. ప్ర‌స్తుతం ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్థ్‌లో కంటెస్టెంట్‌గా గెట‌ప్ శ్రీను కొన‌సాగుతోన్నాడు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel