iDreamPost
android-app
ios-app

సిద్ధార్థ్ రాయ్ మూవీ OTT రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూపులు..

అతడు చిత్రంలో బ్రహ్మనందం కుమారుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా మారి సిద్దార్థ్ రాయ్ అంటూ వచ్చాడు. గత నెలలో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అతడు చిత్రంలో బ్రహ్మనందం కుమారుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా మారి సిద్దార్థ్ రాయ్ అంటూ వచ్చాడు. గత నెలలో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

సిద్ధార్థ్ రాయ్ మూవీ OTT రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూపులు..

లవ్ అండ్ రొమాంటిక్ మూవీలను ఎప్పుడూ ఆదరిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. అందులోనూ విరహ ప్రేమ కథలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇలాంటి లవ్ స్టోరీకి.. కాస్త సైకోటిక్ టచ్ ఇచ్చిన చిత్రం విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి. అమ్మాయిని అమితంగా ప్రేమించే యువకుడు.. ఆమె దక్కకపోతే ఎలా అయిపోతాడో కొత్త వేరియేషన్‌లో చూపించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ కల్ట్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. హిందీ, తమిళంలో కూడా రీమేక్ చేశారు. హిందీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ తరహాలోనే గతంలో రాజశేఖర్ ఓంకారం పిక్చర్ చేశారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి లాంటి ఓ సినిమా థియేటర్లలో రిలీజై.. ఓకే అనిపించింది.

అతడుతో సహా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన కుర్రాడు.. దీపక్ సరోజ్. అతడు హీరోగా పరిచయమైన చిత్రం సిద్దార్థ్ రాయ్. తన్వి నేగి హీరోయిన్. నందిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ పిక్చర్.. గత నెల 23న థియేటర్లలో సందడి చేసింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ పై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించిన ఈ మూవీకి వి యశస్వీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో దీపక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. చాలా మంది అర్జున్ రెడ్డి మూవీతో కంపేర్ చేసి చూశారు కూడా. అయితే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఐఎండీబీ ఏకంగా 9.3 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

సిద్ధార్థ్ రాయ్ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేదు. ఇప్పుడు మాత్రం ఇలాంటి ఒక మంచి సినిమాని థియేటర్లలో మిస్ అయ్యాం. కానీ, ఓటీటీలో మాత్రం తప్పకుండా చూడాలి అంటూ ఆడియన్స్, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాకపోతే మేకర్స్ మాత్రం ఈ మూవీ ఓటీటీ ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీలైనంత త్వరగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి త్వరలోనే ఈ మూవీ ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ ఇస్తారోమో చూడాలి. ఇక కథ విషయానికి వస్తే.. చిన్న వయస్సులోనే ప్రపంచాన్ని చదివేసిన సిద్దార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) లాజిక్కే లైఫ్ గా బతుకుతుంటాడు. ఎమోషన్లనకు కనెక్ట్ కానీ ఈ కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి (తన్వి నేగి) వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ట్రైలర్‌లో అంత వయెలెంట్‌గా హీరో కనిపించడానికి కారణాలు తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి