డైరెక్ట్ గా OTT లోకి ఫ్యామిలీ డ్రామా తిక్‍డమ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Emotional Family Drama: డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఒక్కోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

OTT Emotional Family Drama: డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఒక్కోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఓటీటీ లకు డిమాండ్ పెరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు.. నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. పైగా ఇలా డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే సినిమాలకు కథను బట్టి విపరీతమైన బజ్ కూడా నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు ఎలాగూ అన్ని భాషల చిత్రాలను బాగానే ఆదరిస్తున్నారు కాబట్టి.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు లేకపోలేదు. ఈ సినిమా మరేదో కాదు అమిత్ సియాల్ ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ డ్రామా మూవీ “తిక్ డమ్” . కాగా ఈ సినిమాను జ్యోతి దేశ్‍పాండే, పూనమ్ ష్రాఫ్, పార్థ్ గజ్జర్, సావియో షెనోయ్, శ్వేత శర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ హూస్టన్‍లో స్క్రీనింగ్ పూర్తైన తర్వాత.. ఓ స్పెషల్ అవార్డు కూడా దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను నేరుగా ఓటీటీ లోకి తీసుకుని రానున్నారు మేకర్స్. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను కూడా రివీల్ చేశారు. ఈ సినిమాను ఆగష్టు 23 న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో విడుదక చేయనున్నారు.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. తన సొంత ఊరిలో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రకాష్ అనే వ్యక్తి .. పని కోసం అని సిటీకి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. కానీ అది తన పిల్లలకు ఇష్టం ఉండదు. అయినా సరే తన తండ్రి కోసం.. అతనితో పాటు సిటీకి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఉద్యోగం సంపాదించడానికి అనేక రకాల కష్టాలు పడతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టి.. ఓ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూడాలంటే మాత్రం ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments