OTT లోకి ఫ‌హాద్ ఫాజిల్ ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఇరుల్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Murder Mystery Thriller- Irul Movie OTT Streaming Date: ఫహద్ ఫాజిల్ కు అటు మళయాళంలోనే కాకుండా .. తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. ఇక పుష్ప సినిమా తర్వాత ఈ హీరోకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి ఫహద్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Murder Mystery Thriller- Irul Movie OTT Streaming Date: ఫహద్ ఫాజిల్ కు అటు మళయాళంలోనే కాకుండా .. తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. ఇక పుష్ప సినిమా తర్వాత ఈ హీరోకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి ఫహద్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కేవలం తెలుగు ఉంటేనే ఆ సినిమా చూస్తాం.. లేదా ఈ హీరో సినిమాలే చూస్తాం అని కాకుండా కథ బావుంటే కనుక ఆయా సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం ఓటీటీ లాంగ్వేజ్ బారియర్ లేకుండా అన్ని సినిమాలను , సిరీస్ లను బాగానే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కు అటు మళయాళంలోనే కాకుండా తెలుగులో కూడా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప సినిమా తర్వాత ఈ హీరోకు విపరీతమైన క్రేజ్ పెరిగిందని చెప్పి తీరాలి. దీనితో ఈ హీరోకు సంబంధించిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి ఫహద్ నటించిన ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ సినిమా పేరు ఇరుల్.. ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయినా తర్వాత.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. ఇక మాలయంలో రిలీజ్ అయినా మూడేళ్ళ తర్వాత ఈ మూవీ.. తమిళంలో నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ . ఇక ఈ సినిమాలో ఫహద్ కు జోడిగా ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్ న‌టించింది. కాగా ఈ సినిమాకు న‌సీఫ్‌యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ తమిళ్ లో.. సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు మేకర్స్.ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ గురించైతే ఎలాంటి అప్ డేట్ లేదు కానీ.. ఇప్పుడు తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణ ప్రకారం.. ఈ సినిమా తెలుగులోకి కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ కథ అంతా కూడా కేవలం మూడు పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలెక్స్ అనే అతను ఒక రైటర్. అతను తన గర్ల్ ఫ్రెండ్ అర్చనతో కలిసి కార్ లో ట్రిప్ కు బయలుదేరతాడు. కొంతదూరం బాగానే సాగిన వారి ప్రయాణంలో ఆటంకాలు మొదలవుతాయి. సడెన్ గా ఓ అడవి ప్రాంతాల్లో వారి కార్ ఆగిపోతుంది. షెల్టర్ కోసం దగ్గరలోని ఓ ఇంటికి వెళ్తారు. ఆ హౌస్ ఓనర్ ఫహద్ ఫాజిల్.. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. అసలు ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఏమౌతుంది? నిజంగా ఆ హౌస్ ఫహద్ దేనా ? ఆ తర్వాత ఎం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments