iDreamPost
android-app
ios-app

Dhoomam OTT: ఫహద్ ఫాజిల్ మలయాళ మూవీ.. తెలుగు OTT స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

  • Published Jul 05, 2024 | 2:37 PM Updated Updated Jul 05, 2024 | 2:37 PM

మలయాళ హీరో అయినా కూడా... ఫహద్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే. ఈ క్రమంలోనే తాజాగా ఫహద్ నటించిన ఓ సినిమా ఏడాది తర్వాత తెలుగులో ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

మలయాళ హీరో అయినా కూడా... ఫహద్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే. ఈ క్రమంలోనే తాజాగా ఫహద్ నటించిన ఓ సినిమా ఏడాది తర్వాత తెలుగులో ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jul 05, 2024 | 2:37 PMUpdated Jul 05, 2024 | 2:37 PM
Dhoomam OTT:  ఫహద్ ఫాజిల్ మలయాళ మూవీ.. తెలుగు OTT స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

తెలుగు ప్రేక్షకులను కూడా ఫహద్ సినిమాలు బాగానే మెప్పిస్తున్నాయి. మలయాళీ హీరో అయినా కూడా తెలుగు వారి మదిని దోచేశాడు ఫహద్. ఇక పుష్ప మూవీలో విలన్ క్యారెక్టర్ చేసిన తర్వాత.. తెలుగులో ఫహద్ క్రేజ్ మరింత పెరిగిందన్నమాట ఒప్పుకుని తీరాల్సిందే. అయితే థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా వారం నెల తిరగకముందే ఓటీటీ లోకి వచ్చేస్తుంటే.. కొన్ని సినిమాలు మాత్రం వారం, సంవత్సరాలు గడిచిన కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు నోచుకోవు. ఇప్పుడు ఫహద్ నటించిన ఓ మలయాళ విషయంలోనూ అదే జరిగింది. ఫహద్ నటించిన ఓ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా ఏడాది తర్వాత.. ఓటీటీ లోకి రాబోతుంది. అది కూడా తెలుగులో.. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఏడాది క్రితం మలయాళంలో ఫహద్ నటించిన సినిమా “ధూమం”. అయితే అప్పట్లో ఈ సినిమాను థియేటర్స్ లో తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అని తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. కానీ అది జరగలేదు. కేవలం మలయాళంలో మాత్రమే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఏడాది తర్వాత.. రెండు నెలల క్రితం యూట్యూబ్ వేదికగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ అక్కడ కూడా ఈ సినిమాను కేవలం మలయాళంలోనే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఎట్టకేలకు తెలుగులోకి కూడా తీసుకుని వచ్చారు. ధూమం సినిమా తెలుగు స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను జులై 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం.. డైరెక్ట్ తెలుగు వెర్షన్ ను ఈ నెల 11 నుంచి చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సిగరేట్, పొగాకు తయారు చేసే వ్యాపారాలు చేసే వారు టెర్రరిస్ట్ లతో సమానం అని, వారి వలన సొసైటీకి ఎంతో నష్టం ఉందని.. ఈ సినిమాలో చూపించారు. ఫహద్ ఓ సిగరెట్ కంపెనీలో సేల్స్ హెడ్ గా పనిచేస్తూ ఉంటాడు. తన తెలివితేటలు , మార్కెటింగ్ స్కిల్స్ తో.. ఆ కంపెనీ సేల్స్ పెంచుతాడు. ఈ క్రమంలో ఓ సారి ఆ కంపెనీ ఎండి తో అభిప్రాయ భేదాలు వచ్చిన కారణంగా.. అతను ఆ ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు . కట్ చేస్తే ఆ తర్వాత రోజు.. అతను తన భార్య కలిసి కార్ లో ప్రయాణిస్తుండగా వారిపై అట్టాక్ జరుగుతుంది. ఈ క్రమంలో అతని భార్య శరీరంలో ఎవరో ఓ మైక్రో బాంబును ఫిక్స్ చేస్తారు. ఆ బాంబు పేలకుండా ఉండాలంటే.. తాము చెప్పిన కొన్ని కండీషన్స్ కు ఒప్పుకోవాలని.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ కండిషన్స్ ఏంటి ! వారిపై అట్టాక్ చేసిన వారు ఎవరు ! ఫహద్ తన భార్యను కాపాడుకోగలిగాడా లేదా! ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.