రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

Double Ismart Movie OTT Release: ఈ నెలలో భారీ అంచనాల మధ్యన థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలలో.. రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఒకటి. ఇక ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

Double Ismart Movie OTT Release: ఈ నెలలో భారీ అంచనాల మధ్యన థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలలో.. రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఒకటి. ఇక ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఇలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కావడం , నెల లోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేయడం. ఇప్పుడు ఇవన్నీ సహజం అయిపోయాయి. బాగా హిట్ టాక్ సంపాదించుకున్న సినిమా అయితే తప్ప ప్రేక్షకులు.. థియేటర్స్ వరకు వెళ్లడం లేదు. దాదాపు అందరు ఆయా సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ నెలలో భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా సినిమాలలో రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఒకటి. థియేటర్ లో అనుకున్న రేంజ్ లో మెప్పించని ఈ మూవీ.. ఓటీటీ లోకి రాబోయేది ఇప్పుడే అంటూ ఓ డేట్ వినిపిస్తుంది అదేంటో చూసేద్దాం.

రామ్, పూరి జగన్నాద్ కాంబినేషన్ లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ను రిలీజ్ చేశారు. ఆగష్టు 15 న భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా ఈ సినిమా.. మొదటి రోజు హైప్ బాగానే ఉన్నా సరే… రోజులు గడుస్తున్న కొద్దీ మాత్రం బజ్ తగ్గిపోయింది. దీనితో అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమా.. ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఎలాగూ థియేట్రికల్ రన్ సరిగా లేదు కాబట్టి.. ఈలోపే ఓటీటీ లోకి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్.. రూ.33 కోట్ల లు కొనుగోలు చేసింది. కానీ అటు థియేటర్స్ లో మాత్రం ఈ మూవీ నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. మొత్తం 8 రోజుల్లో రూ.20కోట్ల మార్క్ ను కూడా దాటలేకపోయింది. పక్కా కమర్షియల్ చిత్రంగా థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ మూవీ.. కాసుల వర్షం కురిపిస్తుందని భావించారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. మరి థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments