Spy Thriller Movie In OTT: పాక్ ని వణికించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ పై OTTలో మూవీ! గూస్ బంప్స్ పక్కా!

Spy Thriller Movie In OTT: పాక్ ని వణికించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ పై OTTలో మూవీ! గూస్ బంప్స్ పక్కా!

OTT Movie Suggestion: ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చే కొత్త కంటెంట్ ను మూవీ లవర్స్ ఎలాగూ మిస్ చేయకుండా చూస్తూనే ఉంటారు. మరి ఈ క్రమంలో కొన్ని పాత సినిమాలను మిస్ చేసే అవకాశం ఉంది. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్.

OTT Movie Suggestion: ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చే కొత్త కంటెంట్ ను మూవీ లవర్స్ ఎలాగూ మిస్ చేయకుండా చూస్తూనే ఉంటారు. మరి ఈ క్రమంలో కొన్ని పాత సినిమాలను మిస్ చేసే అవకాశం ఉంది. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్.

ఈ మధ్య కాలంలో రియల్ లైఫ్ స్టోరీస్ తెలుసుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అదే రియల్ లైఫ్ స్టోరీస్ ను బేస్ చేసుకుని వచ్చిన సినిమాల విషయం చెప్పుకునేది. ఈ తరహా సినిమాలను చూడడానికి ఎంతో మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వీటిలో నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని రూపొందించిన సినిమాలు కొన్నైతే .. నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ ను ఆదర్శంగా తీసుకుని రూపొందించిన సినిమాలు మరికొన్ని, ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు కనువిప్పు కలిగించాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

మిలట్రీ వార్ బేస్డ్ జోనర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన ఎంతో మంది వీరుల జీవితాలకు సంబంధించిన విషయాలను ఆయా సినిమాలలో చూపించారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. ఈ సినిమా కథేంటంటే.. ఈ సినిమా కథ 1970’s బ్యాక్డ్రాప్ లో కొనసాగుతుంది. ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల్లో పాకిస్థాన్ ఓడిపోతుంది. దీనితో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరోవైపు ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం.. అణుబాంబు పరీక్షను విజయవంతంగా పూర్తి చేస్తుంది. దీనితో ఇండియాకు పోటీగా పాకిస్థాన్ అటామిక్ బాంబు తయారు చేయాలని అనుకుంటుంది. ఈ భాద్యతను ఖాన్ అనే సైంటిస్ట్‌కు అప్ప‌గిస్తారు.

ఈ అణుబాంబును పాకిస్థాన్ ఎక్కడ తయారు చేస్తుంది.. అనే రహస్యాన్ని తెలుసుకోవడం కోసం మిషన్ మజ్ను పేరుతో.. ఓ సీక్రెట్ ఆపరేషన్ ను చేపడతారు.. ఇండియన్ స్పై ఏజెంట్స్. ఈ మిషన్ ను చెందించడానికి తారిఖ్ అనే వ్యక్తి రంగంలోకి దిగుతాడు. పాకిస్థాన్ లో టైలర్ పని చేస్తున్నట్లు నటిస్తూ.. తన సీక్రెట్ ఆపరేషన్ ను తారిఖ్ ఎలా కొనసాగించాడు ? పాకిస్థాన్ తయారు చేస్తున్న ఆ అటామిక్ బాంబు ఉండే ప్రాంతాన్ని ఎలా తెలుసుకున్నాడు ? ఈ మిషన్ ను ఎలా పూర్తి చేయగలిగారు ? ఇవన్నీ తెలియాలంటే.. వాస్తవ ఘటనలను ఆధారంగా తీసుకుని.. శంత‌ను బాగ్చి రూపొందించిన .. “మిషన్ మజ్ను” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments