iDreamPost

OTT Movie Suggestion: హనుమాన్ మూవీ డైరెక్టర్ మొదటి సినిమా! చాలా మందికి తెలియదు! OTTలో ఉంది!

  • Published May 16, 2024 | 5:06 PMUpdated May 16, 2024 | 5:06 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నా కూడా.. కొన్ని సార్లు అనేక కారణాల చేత ఆయా సినిమాలను మిస్ చేస్తూ ఉంటారు మేకర్స్. ఈ క్రమంలో ఈ సినిమాను కనుక మిస్ చేసి ఉంటే మాత్రం.. ఓ మంచి తెలుగు సైన్స్ ఫిక్షన్ సినిమాను మిస్ అయినట్లే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నా కూడా.. కొన్ని సార్లు అనేక కారణాల చేత ఆయా సినిమాలను మిస్ చేస్తూ ఉంటారు మేకర్స్. ఈ క్రమంలో ఈ సినిమాను కనుక మిస్ చేసి ఉంటే మాత్రం.. ఓ మంచి తెలుగు సైన్స్ ఫిక్షన్ సినిమాను మిస్ అయినట్లే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 16, 2024 | 5:06 PMUpdated May 16, 2024 | 5:06 PM
OTT Movie Suggestion: హనుమాన్ మూవీ డైరెక్టర్ మొదటి సినిమా! చాలా మందికి తెలియదు! OTTలో ఉంది!

ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదంటే.. అందరి నోటా వినిపించేది పేరు “హనుమాన్”. ఈ సినిమా గురించి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి.. నిన్న మొన్నటి వరకు కూడా కథలు కథలుగా చెప్పుకున్నారు. ఈ సినిమా గురించైతే ఎవరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు కానీ.. ఈ దర్శకుడు రూపొందించిన మరొక అద్భుతమైన సినిమా గురించి మాత్రం అందరికి తెలియాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమాను కనుక మిస్ అయినట్లైతే వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “అ!”. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారన్న విషయం.. హనుమాన్ మూవీ సక్సెస్ తర్వాత మాత్రమే అందరు తెలుసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు స్వయంగా నాని నిర్మాతగా వ్యవహరించారు. ప్రేక్షకులు ఊహించని ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇదొక మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెప్పి తీరాలి. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఎందుకు ఈ సినిమాను చూడాలి. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే..

ఈ సినిమాలో కాజల్ తనని తానూ చంపుకోడానికి సిద్ధపడుతుంది. మరో వైపు.. ఈషా రెబ్బ తాను ఓ అమ్మాయిని ప్రేమించానని.. తననే పెళ్లి చేసుకుంటానని.. తన తల్లిదండ్రులకు చెబుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు నిత్యామీనన్. ఇక అవసరాల శ్రీనివాస్ విషయానికొస్తే.. తానూ ఎప్పటికైనా ఓ టైమ్ మిషన్ ను కనిపెట్టి.. గతంలోకి వెళ్లి కోల్పోయిన తన తల్లిదండ్రులను కలవాలని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకొక సీన్ లో రెజీనా డ్రగ్స్ కు బానిస అయిపోయి.. తన బాయ్ ఫ్రెండ్ చేసే దొంగతనానికి సహాయం చేసి.. లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటుంది. ఇక మరొక దగ్గర మురళి శర్మ తనకంటే గొప్ప మాయగాడు లేడనే ఫీల్ లో ఉండగా.. ప్రియదర్శి వంటలు రాకపోయినా కూడా.. యూట్యూబ్‌లో వంటలు చూస్తూ ఓ దగ్గర చెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇలా రకరకాల ప్లాట్స్ తో స్టోరీని ముందుకు తీసుకుని వెళ్తూ.. చివరికి ఒకటే దగ్గర ఈ పాత్రలన్నీ కలుసుకుంటే.. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి