Swetha
OTT Movie Suggestion: హారర్ సినిమాలంటే ఇష్టమున్నా సరే ఈ సినిమా చూస్తే మాత్రం.. కొన్ని రోజుల వరకు నిద్రకూడా పట్టదు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
OTT Movie Suggestion: హారర్ సినిమాలంటే ఇష్టమున్నా సరే ఈ సినిమా చూస్తే మాత్రం.. కొన్ని రోజుల వరకు నిద్రకూడా పట్టదు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
Swetha
హార్రర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కానీ హర్రర్ కథలకు కాస్త సైకో తనాన్ని కూడా యాడ్ చేస్తే.. ఇక ఆ సినిమా చూడాలంటే చాలా దైర్యం తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇలాంటి జోనర్ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చి ఉంటాయి కానీ ఈ సినిమా మాత్రం వాటి అన్నిటికంటే కూడా చాలా డిఫ్ఫరెంట్ అని చెప్పి తీరాలి. హారర్ సినిమాలంటే ఇష్టమున్నా సరే ఈ సినిమా చూస్తే మాత్రం.. కొన్ని రోజుల వరకు నిద్రకూడా పట్టదుఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొన్ని పండగలను అందరు చాలా బాగా జరుపుకుంటూ ఉంటారు. ఇక కొన్ని ప్రాంతాలలో పండుగల సందర్భంలో కోళ్లను మేకలను బలి ఇవ్వడం సహజం. అయితే ఈ సినిమా కథలో మాత్రం కాస్త వింత పద్ధతులు కనిపిస్తాయి. సైకలాజికల్ హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి సైతం ఈ సినిమా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. స్టోరీ లోకి వెళ్తే.. స్వీడన్ లోని హెర్గా అనే ప్లేస్ లో కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు కాస్త వింత పద్ధతులను పాటిస్తూ ఓ పండుగను జరుపుకుంటారు. ఆ పండుగ 90 సంవత్సరాలకు ఓ సారి వేసవిలో వస్తుంది. ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ప్రపంచంలో ఏ మూలాన ఉన్నా కూడా పండుగగకు మాత్రం అక్కడకు వస్తారు. ఈ క్రమంలో హీల్ అనే ఓ కుర్రోడు.. తన నలుగురు ఫ్రెండ్స్ తో ఆ ఫెస్టివల్ కు అటెండ్ అవుతాడు. వచ్చిన తర్వాత ఆ నలుగురు ఫ్రెండ్స్ ను అక్కడి వాళ్ళు రిసీవ్ చేసుకుని మంచి మర్యాదలు చేస్తారు. అక్కడ ఆచారాలన్నీ కూడా డిఫ్ఫరెంట్ గా ఉండడంతో తన ఫ్రెండ్స్ హీల్ ను రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఇక అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది.
హీల్ అక్కడి ఆచారాల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ కమ్యునిటిలో 36 సంవత్సరాల నుంచి.. 54 సంవత్సరాల వరకు ఓ జీవితం ఉంటుందని.. 74 సంవత్సరాల తర్వాత కొత్త జీవితం పొందడానికి ఆ వ్యక్తిని చంపేస్తారని చెప్తాడు. కానీ, ఆ ఫ్రెండ్స్ ఎవరు దానిని నమ్మరు. అక్కడ ఓ సీక్రెట్ హౌస్ ఉంటుంది. ఫెస్టివల్ మొదటి రోజు ఆ సీక్రెట్ హౌస్ నుంచి ఇద్దరు ముసలి వాళ్ళు బయటకు వచ్చి ఆ ఫెస్టివల్ ను స్టార్ట్ చేయడానికి ఓ పెద్ద కొండ ఎక్కుతారు. ఉన్నట్లుండి ఆ ముసలావిడ కొండపై నుంచి దూకేసి చనిపోతుంది. వెంటనే ఆమె భర్త కూడా పై నుంచి దూకేస్తాడు.. అప్పటికి అతను చావకపోవడంతో.. అక్కడున్న వాళ్ళు అతనిని బాగా కొట్టి చంపేస్తారు. అక్కడికి కొత్తగా వచ్చిన హెలి ఫ్రెండ్స్ కు అదంతా అర్థంకాక.. ఏంటి ఇవన్నీ అని ప్రశ్నిస్తే ఇది మా ఆచారం అని బదులిస్తారు.
దీనితో ఆ ఫ్రెండ్స్ లో ఓ వ్యక్తికి దీనిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. కట్ చేస్తే అక్కడకు కొత్తగా వచ్చిన వారిలో ఇద్దరు మిస్ అవుతారు. వారు ఏం అయిపోయారు ? అసలు అక్కడ ఫెస్టివల్ పేరుతో ఏం జరుగుతుంది ? హెలి అనే వ్యక్తి తో పాటు ఆ ఫెస్టివల్ కు వెళ్లిన వారు తిరిగి సేఫ్ గా బయటకు వస్తారా లేదా? చివరికి ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే “మిడ్ సమ్మర్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.