iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలోకి 2 మలయాళం బ్లాక్ బస్టర్స్.. తెలుగులో కూడా

  • Published Aug 06, 2024 | 5:50 PM Updated Updated Aug 06, 2024 | 5:50 PM

OTT Malayala Movies In Telugu: ప్రస్తుతం అటు థియేటర్ లో అయినా.. ఇటు ఓటీటీ లో అయినా మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. జోనర్ తో సంబంధం లేకుండా కథను బట్టి ఆయా సినిమాలను హిట్ చేస్తూ ఉంటున్నారు. దీనితో ఈ వారం ఓటీటీ లోకి రాబోయే ఇంట్రెస్టింగ్ మలయాళ సినిమాలేంటో చూసేద్దాం.

OTT Malayala Movies In Telugu: ప్రస్తుతం అటు థియేటర్ లో అయినా.. ఇటు ఓటీటీ లో అయినా మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. జోనర్ తో సంబంధం లేకుండా కథను బట్టి ఆయా సినిమాలను హిట్ చేస్తూ ఉంటున్నారు. దీనితో ఈ వారం ఓటీటీ లోకి రాబోయే ఇంట్రెస్టింగ్ మలయాళ సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Aug 06, 2024 | 5:50 PMUpdated Aug 06, 2024 | 5:50 PM
ఈ వారం OTTలోకి 2 మలయాళం బ్లాక్ బస్టర్స్.. తెలుగులో కూడా

మలయాళ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించేస్తున్నాయి. మొదటి నుంచి మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఓటీటీ లకు ఆదరణ పెరిగినప్పటినుంచి.. మలయాళీ మూవీస్ పై ఇంకాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా ప్రేమలు మూవీతో థియేటర్స్ లో కూడా ఈ మూవీస్ కొత్త ట్రెండ్ ను సెట్ చేశాయి. ఈ క్రమంలో వారం వారం ఓటీటీ లో కనీసం ఒక మలయాళ మూవీ అయినా రిలీజ్ అవుతుంది. మరి ఈ వారం ఓటీటీ లోకి రెండు ఇంట్రెస్టింగ్ మలయాళ సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

టర్బో:

OTT Malayala Movies In Telugu 2

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సినిమా ‘టర్బో’ .. మే 23వ తేదీన థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఊహించని విధంగా థియేటర్స్ లో హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాకు వైశాక్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు.. రాజ్ బీ శెట్టి , అంజన జయప్రకాశ్, షబరీష్ వర్మ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్, నిరంజన అనూప్ ప్రధాన పాత్రలలో నటించారు. తన స్నేహితుని కోసం రిస్క్ చేసిన హీరోకు.. చివరికి అతని వలెనే ఊహించని పరిణామాలు ఎదురైతే.. వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. ఇక ఈ సినిమా ఆగష్టు 9 నుంచి మళయాళంతో పాటు తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను అసలు మిస్ చేయండి.

నాదన్న సంభవం:

OTT Malayala Movies In Telugu 1

బీజుమీన‌న్‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు ప్రధాన పాత్రలలో నటించిన.. నాద‌న్న సంభ‌వం అనే మలయాళ మూవీ..ఈ సినిమాకు విష్ణు నారాయణన్ దర్శకత్వం వహించగా.. జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ఊహించని విధంగా సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. పెళ్ళైన రెండు జంటల మధ్య అనుకోకుండా ఒకరి పై ఒకరి అనుమానాలు, అపర్దాలు కలిగితే.. వాటిని వారు ఏ విధంగా డీల్ చేశారు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అయితే ఈ సినిమా రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కాకుండా.. సింప్లి సౌత్ , మనోరమ మాక్స్ అనే ఓటీటీ లలో ఈ సినిమా ఆగష్టు 9 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ కామెడి ఎంటర్టైనర్ కూడా ఎంచక్కా చూసేయండి.

ఇక ఈ సినిమాలతో పాటు చాలానే సినిమాలు ఈ వారం ఓటీటీ లో సందడి చేయడానికి రెడీ గా ఉన్నాయి. ఇక ఈ సినిమాలే కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.