Swetha
శుక్రవారం అంటే కేవలం థియేటర్స్ లోనే కాదు ఇప్పుడు ఓటీటీ లలోను పండగ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకే రోజు ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాలేంటో చూసేద్దాం.
శుక్రవారం అంటే కేవలం థియేటర్స్ లోనే కాదు ఇప్పుడు ఓటీటీ లలోను పండగ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకే రోజు ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాలేంటో చూసేద్దాం.
Swetha
ఎప్పటిలానే మరొక శుక్రవారం వచ్చేస్తుంది. శుక్రవారం అంటే కేవలం థియేటర్స్ లోనే కాదు ఇప్పుడు ఓటీటీ లలోను పండగ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తు ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం కూడా చాలానే సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నా సరే.. కేవలం కొన్ని మాత్రమే వాటిలో చూడదగినవిగా ఉంటాయి. ఇక ఈ వారం ఒకే రోజు ఏకంగా 6 సినిమాలు /సిరీస్ లు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
గత వారం ఓటీటీ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిన మాట వాస్తవమే. అయితే ఈ వారం మాత్రం అలా కాదు. అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు, సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలను మాత్రం అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఆ సినిమాలేంటంటే..
వీటిలో బాగా ఇంపార్టెంట్ సినిమాలంటే విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అని చెప్పి తీరాలి. ఈ సినిమా థియేటర్స్ లో డీసెంట్ టాక్ డీసెంట్ కలెక్షన్స్ తో బయటకు వచ్చింది. సో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీ లో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సినిమా కాకుండా పరువు, యక్షిణి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం స్పెషల్ అని చెప్పుకుని తీరాలి. ఎందుకంటే తెలుగులో మంచి వెబ్ సిరీస్ లు వచ్చి చాలానే కాలం అయింది. కాబట్టి ఈ వెబ్ సిరీస్ లను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా.. చైతన్య రావు నటించిన.. డియర్ నాన్న సినిమా కూడా ఈ వారం వాచ్ లిస్ట్ లో యాడ్ చేస్కోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ అంత కలిసి కూర్చుని చూసేలా చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి. కాబట్టి.. ఈ సినిమా కూడా ఈ వీకెండ్ బెస్ట్ సజ్జెషన్ అని చెప్పుకోవచ్చు. ఇక బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి నటించిన లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ మూవీ కూడా జూన్ 14 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లో సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఈ సినిమాలను పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.