iDreamPost
android-app
ios-app

OTTలో మీర్జాపూర్ ఫేమ్ కాలిన్ భయ్యా మూవీ.. యాక్టింగ్ ఫిదా అయిపోతారు!

  • Published Jul 02, 2024 | 6:24 PM Updated Updated Jul 02, 2024 | 6:24 PM

Divyendu Sharma Ekkees Toppon Ki Salaami Movie: మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కాలిన్ భయ్యా అంటూ పిలుచుకుంటారు. ఆయన చేసిన ఒక అద్భుతమైన సినిమా ఓటీటీలో ఉన్నా కూడా చాలా మంది ఇంకా చూడలేదు.

Divyendu Sharma Ekkees Toppon Ki Salaami Movie: మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కాలిన్ భయ్యా అంటూ పిలుచుకుంటారు. ఆయన చేసిన ఒక అద్భుతమైన సినిమా ఓటీటీలో ఉన్నా కూడా చాలా మంది ఇంకా చూడలేదు.

  • Published Jul 02, 2024 | 6:24 PMUpdated Jul 02, 2024 | 6:24 PM
OTTలో మీర్జాపూర్ ఫేమ్ కాలిన్ భయ్యా మూవీ.. యాక్టింగ్ ఫిదా అయిపోతారు!

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక వెబ్ సిరీస్ సీక్వెల్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. అది మరేదో కాదు.. మీర్జాపూర్ సీజన్ 3. అయితే మొదటి రెండు సీజన్స్ లో కాలిన్ భయ్యా అలరించిన విషయం తెలిసిందే. కానీ, ఈసారి వచ్చే సీక్వెల్ మాత్రం కాలిన్ భయ్యా లేడు అని తెలిసిందే. చాలామంది ఆ కాలిన్ భయ్యా పాత్రను బాగా మిస్ అవుతున్నారు. అయితే ఆ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేలోపు ఒకసారి కాలిన్ భయ్యా అలియాస్ దివ్యేందు శర్మా చేసిన ఒక కామెడీ ఎంటర్ టైనర్ ని చూసేయండి. నిజానికి మీకు ఈ యాక్టర్ మిర్జాపూర్ నుంచే తెలిసి ఉండచ్చు. కానీ, కెరీర్ ప్రారంభం నుంచి దివ్యేందు శర్మా ఇలాంటి చాలానే మంచి మంచి సినిమా చేశాడు. అందులో ఈ మూవీ కూడా ఒకటి.

సాధారణంగా బాలీవుడ్ అనగానే అంతా యాక్షన్, లవ్ స్టోరీలు అనుకుంటారు. కానీ, బాలీవుడ్ నుంచి ఎన్నో గొప్ప గొప్ప కామెడీ డ్రామాలు వచ్చాయి. ఆ లిస్టులో ఈ మూవీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం కామెడీ డ్రామానే కాదు.. ఇందులో ఒక తండ్రి చివరి కోరిక, ఇద్దరు కొడుకుల తాపత్రయం కూడా ఉంటాయి. ఈ సినిమా మొత్తం ఫుల్ లెంగ్త్ కామెడీగా సాగిపోతూ ఉంటుంది. కానీ, సినిమా పాయింట్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. తన తండ్రి చివరి కోరిక తీర్చేందుకు ఇద్దరు కొడుకులు పడే కష్టం ఈ సినిమాలో ఉంటుంది. అయితే ఇదంతా ఫన్నీ వేలో చూపిస్తారు. వారి కష్టం చూసి మీరు కచ్చితంగా నవ్వుతారు.

అంటే వాళ్లు కష్టపడుతుంటే మనం నవ్వడం ఏంటండి.. రాక్షసానందం కాకపోతే అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఏమీ తెలియక వాళ్లు చేసే తింగరి పనులు కాస్త ఫన్ ని క్రియేట్ చేస్తుంటాయి. అయితే ఈ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దివ్యేందు శర్మా అని చెప్పాలి. ఆ తర్వాత తండ్రి పాత్ర చేసిన అనుపమ్ ఖేర్. ఒక నిజాయితీ గల ఉద్యోగిగా.. తన రిటైర్మెంట్ తర్వాత ఒక గౌరవాన్ని కోరుకుంటాడు. కానీ, ఒక కరప్టెడ్ అధికారి ఆయనను బాగా అవమానిస్తాడు. అయితే బాధలో ఉన్న తండ్రికి కొడుకు భరోసా కల్పించాలని చూస్తారు. తనకు తిరిగి గౌరవం తెప్పిస్తామని చెప్తారు.

అందుకు ఆ తండ్రి 21 తుపాకులతో గౌరవ వందనం కావాలి అంటూ ప్రాణాలు విడుస్తాడు. ఆ తండ్రికి ఎలాగైనా ఆ గౌరవాన్ని అందేలా చేయాలి అని ఈ కొడుకులు సర్వ ప్రయత్నాలు చేస్తారు. మరి.. ఆ తండ్రి చివరి కోరిక తీరిందా? ఆ కొడుకు అనుకున్నది సాధించారా? అసలు అంతటి గౌరవం అందించేందుకు ఆ తండ్రి ఏం సాధించాడు? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం కావాలి అంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ “ఇక్కీస్ తోపోంకి సలామీ” అనే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş