OTT లో స్ట్రీమింగ్ తర్వాత మరింత పెరిగిన ట్రోలింగ్.. ఇలా అయితే కష్టమే

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు అన్నీ కూడా.. ఎప్పటికైనా ఓటీటీ లోకి రావాల్సిందే. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో ప్లాప్ అయినా ఓటీటీ లో మాత్రం ఊపందుకుంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలకు మాత్రం ఓటీటీ లోను ట్రోలింగ్స్ తప్పడం లేదు.

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు అన్నీ కూడా.. ఎప్పటికైనా ఓటీటీ లోకి రావాల్సిందే. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో ప్లాప్ అయినా ఓటీటీ లో మాత్రం ఊపందుకుంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలకు మాత్రం ఓటీటీ లోను ట్రోలింగ్స్ తప్పడం లేదు.

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది. గత కొన్ని నెలలుగా థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే సినిమాలు.. ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు అనూహ్యంగా థియేటర్ లో ప్లాప్ అయినా కూడా.. ఓటీటీ లో మాత్రం దుమ్ము దులిపేస్తూ ఉంటాయి. ప్రేక్షకులు కూడా కంటెంట్ బావుంటే ఏ రేంజ్ లో సక్సెస్ చేస్తారో.. బాలేకపోతే అంతకు మించి ట్రోల్ల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి దర్శకులు థియేటర్స్ లో వారి సినిమాలకు ట్రోలింగ్స్ వచ్చినా కూడా.. ఓటీటీ లపై ఆశలు పెట్టుకుంటారు. వాటిలో కొన్ని సినిమాలు అనుకున్నట్లుగానే ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అయితే ఇప్ప్పుడు చెప్పుకునే సినిమాలకు మాత్రం.. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా ట్రోలింగ్స్ తప్పడం లేదు. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

మాస్ మహారాజ రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ మీద.. రిలీజ్ కు ముందు విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సినిమాతో పక్కా రవి తేజ మాస్ కమ్ బ్యాక్ ఇస్తాడని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూశారు. అలా భారీ అంచనాల మధ్యన ఆగస్ట్ 15న రిలీజ్ అయినా మూవీ ఊహించని విధంగా ప్లాప్ అవ్వడంతో దర్శకుడిగా ట్రోల్ల్స్ తప్పలేదు. ఇక అదే రోజు రిలీజ్ అయినా రామ్ డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి కూడా ఇదే. కంటెంట్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమాల మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. పోనీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాతైనా ప్రేక్షకులు ట్రోలింగ్స్ ఆపేస్తారా అంటే.. ఇప్పుడు ఈ సినిమాను సీన్స్ కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇంకాస్త ఎక్కువగానే ట్రోల్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలు బయట పడడం లేదు కానీ.. ఈ ట్రోల్ల్స్ ఎప్పుడు ఆగతాయా అనే ఫీల్ లోనే ఉన్నారు. సో ఇలా మొత్తానికి ఓటీటీ లోను ఈ సినిమాలకు ప్రశాంతత లేకుండా పోయిందని చెప్పి తీరాల్సిందే.

ఇక ఈ రెండిటికంటే ముందు ఓటీటీ లోకి వచ్చిన ఇండియన్2 సినిమా అయితే ఇంకాస్త డిఫరెంట్. శంకర్ , కమల్ హాసన్ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు కమల్ హాసన్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓటీటీ లో మాత్రం ట్రెండింగ్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ట్రోల్ల్స్ చేయడం కోసమే ట్రెండ్ చేసారని ఆ తర్వాత గమనించారు మేకర్స్. థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీ లో కూడా ఈ రకమైన ట్రోలింగ్స్ వస్తూ ఉంటే మాత్రం.. కాస్త కష్టమే అని చెప్పి తీరాలి. ఇలాంటి ట్రోలింగ్స్ ఆప్ బాధ్యత కూడా దర్సకులదే. మరి ఇకనైనా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కు తగినట్లుగా మంచి కంటెంట్ తో సినిమాలు వస్తాయేమో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments