ఈ వారం థియేటర్/ OTTలో రిలీజ్ అవుతున్న చిత్రాలివే!

This Week Theatre And OTT Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లోకి అదిరిపోయే సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా జులై 12వ తారీఖు ఒక్కరోజే అటు థియేటర్, ఇటు ఓటీటీలో ఎక్కువ రిలీజులు ఉన్నాయి. మరి.. అసలు ఈ వారం ఏ సినిమాలు రాబోతున్నాయి? ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయి చూద్దాం.

This Week Theatre And OTT Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లోకి అదిరిపోయే సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా జులై 12వ తారీఖు ఒక్కరోజే అటు థియేటర్, ఇటు ఓటీటీలో ఎక్కువ రిలీజులు ఉన్నాయి. మరి.. అసలు ఈ వారం ఏ సినిమాలు రాబోతున్నాయి? ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయి చూద్దాం.

వీకెండ్ లో ఫుల్ గా ఓటీటీలో మూవీస్ చూసిన తర్వాత సోమవారం పొద్దున్నే చేసే ఒక పని ఉంటుంది. ఈ వారం ఓటీటీలోకి, థియేటర్లోకి ఏం సినిమాలు రాబోతున్నాయి? అంటూ వెతుకులాట మొదలు పెడతారు. అలాంటి వారి కోసమే ఈ వారం ఓటీటీల్లోకి అలాగే థియేటర్లోకి ఏయే సినిమాలు విడుదల కాబోతున్నాయో.. ఒక లిస్ట్ తీసుకొచ్చాం. ఈ లిస్టులో మీక కచ్చితంగా నచ్చే సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా థియేటర్ ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భారతీయుడు మళ్లీ వస్తున్నాడు. అందుకు ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అలాగే ఓటీటీలోకి కూడా అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి.

థియేటర్లలో:

థియేటర్లలో ప్రస్తుతం అంతా కల్కి హడావుడి నడుస్తోంది. దాదాపుగా రెండు వారాలుగా కల్కి 2898 ఏడీ ప్రేక్షకులను అలరిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాకి ఫిదా అయిపోయారు. అలాగే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా.. రిపీట్ ఆడియన్స్ కూడా పెరిగారు. ఇప్పుడు కల్కి సోలో యాక్షన్ కు కలి కమల్ హాసన్ కాస్త పోటీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. డైరెక్టర్ శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 జులై 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. జులై 12న ఒక ఫ్యామిలీ మూవీ కూడా రాబోతోంది. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో పద్మారావు అబ్బిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కించిన సారంగదరియా విడుదల కాబోతోంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఓటీటీల్లో:

నెట్ ఫ్లిక్స్:

  • వైల్డ్ వైల్డ్ పంజాబ్ (హిందీ)- జులై 10
  • రిసీవర్ (సిరీస్)- జులై 10
  • వైకింగ్స్: వాల్ హల్లా సీజన్ 3- జులై 11
  • మహారాజ- జులై 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

  • కమాండర్ కరణ్ సక్సేనా (హిందీ సిరీస్)- జులై 8
  • మాస్టర్ మైండ్ (సిరీస్)- జులై 10
  • అగ్నిసాక్షి (థ్రిల్లర్ సిరీస్)- జులై 12
  • షో టైమ్ (సిరీస్)- జులై 12
  • జియో సినిమా: పిల్ (హిందీ సిరీస్)- జులై 12
  • ఈటీవీ విన్: హరోం హర- జులై 12
  • సోనీలివ్: 36 డేస్- (హిందీ సిరీస్)- జులై 12
  • మనోరమా మ్యాక్స్: మందాకిని(మలయాళం)- జులై 12
Show comments