iDreamPost
android-app
ios-app

డీమాంటీ కాలనీ 2 OTT పార్ట్నర్ లాక్డ్.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

  • Published Aug 23, 2024 | 5:16 PM Updated Updated Sep 10, 2024 | 10:30 AM

Demonte Colony 2 Movie OTT Platform: ఓటీటీ లలోనే కాకుండా థియేటర్స్ లో కూడా హర్రర్ సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా హర్రర్ మూవీ 'డీమాంటీ కాలనీ 2'. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Demonte Colony 2 Movie OTT Platform: ఓటీటీ లలోనే కాకుండా థియేటర్స్ లో కూడా హర్రర్ సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా హర్రర్ మూవీ 'డీమాంటీ కాలనీ 2'. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 23, 2024 | 5:16 PMUpdated Sep 10, 2024 | 10:30 AM
డీమాంటీ కాలనీ 2 OTT పార్ట్నర్ లాక్డ్.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

హర్రర్ సినిమాలు ఏ లాంగ్వేజ్ లో వచ్చినా భాషతో సంబంధం లేకుండా వాటిని సూపర్ సక్సెస్ చేస్తుంటారు. హర్రర్ కథలకు ఎప్పుడు డిమాండ్ బాగానే ఉంటుంది. అది ఓటీటీ లోకి వచ్చినా , థియేటర్ లో రిలీజ్ అయినా కూడా విపరీతమైన స్పందన లభిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఈ జోనర్ లో చాలా సినిమాలు చూసి ఉంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఆగస్ట్ 23న తెలుగులో థియేటర్ లో రిలీజ్ అయినా సినిమా డీమాంటీ కాలనీ 2.ప్రస్తుతం ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యి ఒక్క రోజు కూడా కాకముందే.. ఈ సినిమా ఓటీటీ డీల్ ముగిసినట్లు సమాచారం. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

డీమాంటీ కాలనీ 2 అనేది ఒరిజినల్ గా తమిళ సినిమా.. అయినా కూడా తెలుగులో కూడా ఈ సినిమాకు విపరీతమైన స్పందన లభిస్తుంది. డీమాంటీ కాలనీ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన డీమాంటీ కాలనీ 2 కు కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తుంది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అరుళ్ నిధి, ప్రియా భవానీ, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తు కుమార్ శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. తమిళంలో ఆగష్టు 15 రిలీజ్ అయినా ఈ సినిమా తెలుగులో ఆగష్టు 23న రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకుంది. ఓటీటీ తో పాటు శాటిలైట్ హక్కులను జీ తెలుగు నెట్ వర్క్ సొంతం చేసుకుంది.

తెలుగులో విడుదలైన మొదటి రోజే ఈ సినిమా.. మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది కాబట్టి.. లాంగ్ రన్ లో హిట్ టాక్ సంపాదించుకునే అవకాశం లేకపోలేదు. అలాగే కలెక్షన్స్ విషయంలో కూడా తెలుగు స్ట్రయిట్ సినిమాలకు పోటీగా రానుంది ఈ మూవీ. ఇక థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఎలాగూ హర్రర్ సినిమాలకు డిమాండ్ బాగా ఉంది కాబట్టి.. థియేటర్ లో ఎలా ఉన్నా కానీ.. ఓటీటీ కి వచ్చిన తర్వాత మాత్రం ఈ సినిమాకు మంచి వ్యూస్ లభించే అవకాశం లేకపోలేదు. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.