iDreamPost
android-app
ios-app

OTTలోకి స్క్విడ్ గేమ్ 2! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Apr 21, 2024 | 6:31 PM Updated Updated Apr 21, 2024 | 6:31 PM

Squid Game Season 2: ఓటీటీలోకి ఎన్నో వెబ్ సిరీస్లు వస్తున్నాయి. కానీ, ఫ్యాన్స్ మాత్రం కొన్ని సిరీస్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. వాటిలో ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ కూడా ఒకటి. ఈ సిరీస్ సీజన్ 2 ఓటీటీలోకి రాబోతోంది.

Squid Game Season 2: ఓటీటీలోకి ఎన్నో వెబ్ సిరీస్లు వస్తున్నాయి. కానీ, ఫ్యాన్స్ మాత్రం కొన్ని సిరీస్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. వాటిలో ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ కూడా ఒకటి. ఈ సిరీస్ సీజన్ 2 ఓటీటీలోకి రాబోతోంది.

  • Published Apr 21, 2024 | 6:31 PMUpdated Apr 21, 2024 | 6:31 PM
OTTలోకి స్క్విడ్ గేమ్ 2! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొన్ని వెబ్ సిరీస్లు ఓటీటీ ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి వాటిలో మీర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్, సేకర్డ్ గేమ్స్, మనీ హెయిస్ట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. వాటిలో స్క్విడ్ గేమ్ కూడా ఒకటి. 2021లో వచ్చిన ఈ కొరియన్ యాక్షన్ సిరీస్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న ఎంతో మంది అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పటికీ స్క్విడ్ గేమ్ కు స్పేషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ కి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అలాంటి స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ కి సంబంధించి క్రేజీ వార్తను నెట్ ఫ్లిక్స్ పంచుకుంది. సీజన్ 2కి సంబంధించి అప్ డేట్ అయితే ఇచ్చింది.

నెట్ ఫ్లిక్స్ వరల్డ్ వైడ్ గా ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్లు ఆ రేంజ్లో ఉంటాయి. అభిమానుల అంచనాలను ఎప్పటికీ తగ్గించకుండా నెట్ ఫ్లిక్స్ సంస్థ సరికొత్త ప్రాజెక్టులతో అలరిస్తూ ఉంటుంది. వాటిలో స్క్విడ్ గేమ్ లాంటి వెబ్ సిరీస్లు అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుని ఉన్నాయి. ఈ సిరీస్ వచ్చి ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది. ఈ సిరీస్ కి సీక్వెల్ ఇంకా రాకపోవడంపై ఫ్యాన్స్ ఒకింత నిరాశగా ఉన్నారు. అయితే స్క్విడ్ గేమ్ సిరీస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సీజన్ 2 ఈ ఏడాదిలోనే రాబోతోంది అంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే 2024లోనే స్క్విడ్ గేమ్ సీజన్ 2 స్ట్రీమింగ్ కి రాబోతోంది అనే విషయం అయితే అర్థమవుతోంది.

ఈ ఏడాది సెకండాఫ్ లోనే ఈ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. కామిక్ బుక్ రిపోర్ట్ తాజాగా ఈ విషయాన్ని అయితే వెల్లడించింది. కానీ, ఎప్పుడు? ఏ నెలలో స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉంది? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం బట్టి.. ఈ ఏడాదిలో మాత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న స్క్విడ్ గేమ్ సిరీస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత రెండేళ్లుగా వాళ్లు ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలో మాత్రం కన్ఫామ్ అని తెలుసుకుని సంతోష పడుతున్నారు. అయితే ఆ మంత్ కూడా తెలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి 2024 ఫస్ట్ హాఫ్ లోనే స్క్విడ్ గేమ్ స్ట్రీమింగ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, అది సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం తప్పే ఛాన్స్ లేదని.. కచ్చితంగా స్ట్రీమింగ్ అవతుందని చెప్తున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş