iDreamPost
android-app
ios-app

కమిటీ కుర్రాళ్ళు మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్ .. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

  • Published Aug 26, 2024 | 3:29 PM Updated Updated Aug 26, 2024 | 3:29 PM

Committee Kurrollu Movie OTT Platform Confimed: ప్రస్తుతం థియేటర్స్ లో చిన్న సినిమాల హావ నడుస్తుంది. ఈ క్రమంలో ఈ నెలలో రిలీజ్ అయినా సినిమాలలో కమిటీ కుర్రాళ్ళు మూవీ ఈ ట్రెండ్ ను సెట్ చేసింది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ను లాక్ చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Committee Kurrollu Movie OTT Platform Confimed: ప్రస్తుతం థియేటర్స్ లో చిన్న సినిమాల హావ నడుస్తుంది. ఈ క్రమంలో ఈ నెలలో రిలీజ్ అయినా సినిమాలలో కమిటీ కుర్రాళ్ళు మూవీ ఈ ట్రెండ్ ను సెట్ చేసింది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ను లాక్ చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 26, 2024 | 3:29 PMUpdated Aug 26, 2024 | 3:29 PM
కమిటీ కుర్రాళ్ళు మూవీ  OTT పార్ట్నర్ ఫిక్స్ .. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్ని కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో బాగా బజ్ ఉన్న సినిమాలకు థియేట్రికల్ రీలిజ్ కు ముందే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. ఇక కొన్ని సినిమాలకు మాత్రం థియేటర్ రిలీజ్ తర్వాత వచ్చే టాక్ ను బట్టి.. ఓటీటీ డీల్ ముగుస్తుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా థియేటర్స్ లో.. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. భారీ సక్సెస్ అందుకున్న కమిటీ కుర్రాళ్ళు మూవీ.. ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ మూవీ ఏ ఓటీటీ లోకి రానుంది అనే విషయాలను చూసేద్దాం.

ప్రస్తుతం థియేటర్స్ లో చిన్న సినిమాల హావ నడుస్తుంది. కథలో కంటెంట్ ఉంటే.. ఎలాంటి పోటినైన తట్టుకుని.. టాప్ లో దూసుకుపోవచ్చని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఇప్పడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సరిగ్గా ప్రేక్షకుల అంచనాలకు తగినట్లు వచ్చిన ఈ సినిమా.. సక్సెస్ ఫుల్ గా నాలుగవ వారం కూడా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ ను కూడా కుదుర్చుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా ‘ఈరోజు మా ఈటీవీ విన్ ఆఫీస్ కు 11 మంది కుర్రాళ్ళు వచ్చారు’ అంటూ ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే దాదాపు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఫిక్స్ అయినట్లే.

అయితే ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయినా సినిమా.. నెల తర్వాత ఓటీటీ లోకి రావాలి. దీనిని బట్టి చూస్తే కమిటీ కుర్రాళ్ళు మూవీ సెప్టెంబర్ లో ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో .. కలిసి రూపొందించిన ఈ మూవీ ఇలాంటి సక్సెస్ ను సాధించడం అంటే విశేషం అనే చెప్పి తీరాలి.పైగా పెద్ద సినిమాలు రిలీజ్ అయినా సరే.. ఇంకా మూవీ కంపిటిషన్ లో ఉంది అంటే మెచ్చుకోవాల్సిన విషయమే. మరి ఈ మూవీ  థియేట్రికల్ రన్ పూర్తయ్యే లోపు మేకర్స్ కు ఎలాంటి లాభాలను తెచ్చిపెడుతుందో చూడాలి. ఇంకా ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.