iDreamPost
android-app
ios-app

తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చిన.. యోగిబాబు సూప‌ర్ హిట్ కామెడీ మూవీ ‘గుడ్ లక్ గణేషా’

  • Published Sep 14, 2024 | 5:51 PM Updated Updated Sep 14, 2024 | 5:51 PM

Comedian Yogi Babu Telugu Movie- God Ganesha Free Streaming: ప్రస్తుతం కోలీవుడ్ లో కమెడియన్ యోగిబాబుకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా యోగి బాబు నటించిన ఓ తమిళ మూవీ తెలుగు వెర్షన్ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

Comedian Yogi Babu Telugu Movie- God Ganesha Free Streaming: ప్రస్తుతం కోలీవుడ్ లో కమెడియన్ యోగిబాబుకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా యోగి బాబు నటించిన ఓ తమిళ మూవీ తెలుగు వెర్షన్ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Sep 14, 2024 | 5:51 PMUpdated Sep 14, 2024 | 5:51 PM
తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చిన.. యోగిబాబు సూప‌ర్ హిట్ కామెడీ మూవీ ‘గుడ్ లక్ గణేషా’

ఓటీటీ స్ట్రీమింగ్ కు ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే ఇక మూవీ లవర్స్ కు పండగే. అందులోను తెలుగు సినిమాలంటే ఇక అసలు ఆలోచించకుండా వెంటనే చూసేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి అలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ తమిళ మూవీ తెలుగు వెర్షన్ లోకి వచ్చేసింది. అదే కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు నటించిన తమిళ మూవీ యానై మూగతాన్. తెలుగులో గుడ్ లక్ గణేషా. ఇదొక కంప్లీట్ ఫాంటసీ కామెడీ మూవీ. మరి ఈ మూవీ ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ప్రస్తుతం కోలీవుడ్ లో కమెడియన్ యోగి బాబుకు విపరీతమైన క్రేజ్ నడుస్తుంది. రీసెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా చట్నీ సాంబార్ సిరీస్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గుడ్ లక్ గణేశా సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో యోగిబాబుతో పాటు.. ర‌మేష్ తిల‌క్‌, ఊర్వ‌శి ముఖ్య పాత్రలలో నటించారు. గత ఏడాది తమిళంలో థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ ఫాంటసీ కామెడీ మూవీ హిట్ టాక్ ను సంపాదించుకుంది. అలాగే దర్శక నిర్మాతలకు కూడా లాభాలనే తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు రాజేష్ మిథిలా ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఆల్రెడీ ఆహ లో ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సెప్టెంబర్ 14 నున్నచీ ఈ సినిమా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే కనుక వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇది వినాయకుని భక్తుని కథ. ఈ మూవీలో యోగిబాబు వినాయకుడిగా నటించాడు. గణేష్ అనే వ్యక్తి.. తన ఇంటి ఓనర్ మల్లిక ఇచ్చిన ఆటోను నడుపుకుంటూ బ్రతుకుతాడు. తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేస్తూ.. అబద్దాలు చెప్తూ అందరిని మోసం చేస్తుంటాడు. పైగా అప్పుల వాళ్ళు తనను వేదించకుండా ఉండాలని ప్రతి రోజు వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. సడెన్ గా ఓ రోజు గణేష్ పూజించే వినాయకుడు మాయం అవుతాడు. ఎక్కడా గణేష్ కు వినాయకుడు కనిపించడు. మరో వైపు అప్పుల వాళ్ళ బాధ ఎక్కువవుతూ ఉంటుంది. ఇలా ఓ రోజు మనిషి రూపంలో వినాయకుడు గణేష్ ముందుకు వచ్చి.. అబద్దాలు చెప్పకుండా ఓ రోజు నీతిగా, నిజాయితీగా బ్రతికితే మళ్ళీ కనిపిస్తాననే కండిషన్ పెడతాడు. ఆ తర్వాత ఏమైంది ? గణేష్ ఆ కండిషన్స్ కు ఒప్పుకున్నాడా? వినాయకుడు తిరిగి వచ్చాడా లేదా ? అనేదే సినిమా కథ. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.