Bujji & Bhairava OTT: OTTలో స్ట్రీమ్ అవుతున్న “బుజ్జి అండ్ భైరవ” సిరీస్! కల్కి కథ చెప్పేశారుగా!

Kalki 2898 AD- Bujji & Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కల్కి కోసం ప్రపంచం అంతా ఎదురుచూసేలా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఎన్నో వార్తలు వింటూనే ఉంటున్నాము. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ లోకి వచ్చేసింది.

Kalki 2898 AD- Bujji & Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కల్కి కోసం ప్రపంచం అంతా ఎదురుచూసేలా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఎన్నో వార్తలు వింటూనే ఉంటున్నాము. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ లోకి వచ్చేసింది.

థియేటర్ లో రిలీజ్ అయినా పది పదిహేను రోజులకు ఓటీటీ లోకి రావడం చూసి మూవీ లవర్స్ ఆశ్చర్య పోతున్నారు. ఇక ఇప్పుడు ఆల్రెడీ థియేట్రికల్ రీలిజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసేసుకుంటున్నాయి. ఆ అప్ డేట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే అప్ డేట్ మాత్రం ఎవరు ఊహించినది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు సంబంధించిన సినిమా.. ఇప్పుడు అందరి కళ్ళు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా మీదే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. బుజ్జి భైరవ కు సంబంధించిన ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు, ఇక ఇప్పుడు ఈ యానిమేటెడ్ సిరీస్ ఓటీటీ లోకి వచ్చేసింది.

కల్కి 2898 AD సినిమా రిలీజ్ కోసం ప్రపంచమంతా వెయిట్ చేసేలా ప్రమోషన్స్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా జూన్ 27 న రిలీజ్ కాబోతున్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. దీని కోసం ప్రేక్షకులంతా ఎంత ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కంటే ముందే “బుజ్జి అండ్ భైరవ” యానిమేటెడ్ సిరీస్ ను రిలేజ్ చేశారు మేకర్స్ . ఈ సిరీస్ లో నాగ్ అశ్విన్ బుజ్జి భైరవ పాత్రల గురించి .. అలాగే కల్కి ప్రపంచం గురించి వివరించారు. వైజయంతీ మూవీస్‌, గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌తో కలిసి ఈ యానిమేటెడ్ సిరీస్ ను రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్ మొత్తంగా నాలుగు ఎపిసోడ్స్ గా ఉండబోతుంది. ఈ సిరీస్ ను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ , స్పానిష్ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కల్కి సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకాస్త సమయం ఉంది కాబట్టి. ఈలోపు ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేసేయండి. కల్కి సినిమా అర్ధం చేసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

కల్కి ప్రపంచంలోకి అందరిని తీసుకువెళ్లే ప్రయత్నంలో.. బుజ్జి అండ్ భైరవ సిరీస్ తో .. థియేట్రికల్ రిలీజ్ కు ముందుగానే ఓటీటీ లోకి వచ్చేసింది కల్కి టీమ్. ఇప్పటివరకు ఇలాంటి ప్రమోషన్స్ ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండవు. ఆ రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అందులోను సినిమా ఏంటి అనేది తెలియజేయడానికి ఇటువంటి యానిమేటెడ్ సిరీస్ తో.. థియేట్రికల్ రిలీజ్ కు ముందుగానే ఓటీటీ లోకి రావడం అనేది మునుపెన్నడూ చూడని విషయం. దీనితో ఈ సినిమాపై అందరికి మరింత అంచనాలు పెరిగిపోయాయి. కాబట్టి వెంటనే అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ను చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments