iDreamPost
android-app
ios-app

అఫీషియల్ :ఇండియన్ 2 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Aug 01, 2024 | 6:55 PM Updated Updated Aug 01, 2024 | 6:55 PM

Bharateeyudu 2 OTT Streaming Date: శంకర్ , కమల హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ గురించి.. ఇప్పటివరకు చాలానే డిస్కషన్స్ జరిగాయి. ఇక థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు మాత్రం ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.

Bharateeyudu 2 OTT Streaming Date: శంకర్ , కమల హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ గురించి.. ఇప్పటివరకు చాలానే డిస్కషన్స్ జరిగాయి. ఇక థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు మాత్రం ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.

  • Published Aug 01, 2024 | 6:55 PMUpdated Aug 01, 2024 | 6:55 PM
అఫీషియల్ :ఇండియన్ 2 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

సాధారణంగా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న క్రమంలో.. ఓటీటీ రూల్స్ ప్రకారం నెల రోజుల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇవ్వాలి.. కానీ ఆయా సినిమాల థియేట్రికల్ రన్, టాక్ ను బేస్ చేసుకుని.. వీలైనంత త్వరగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఇండియన్ 2 మూవీ కూడా యాడ్ అవ్వబోతుంది. ఒక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఏ రకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందో.. అదే సినిమా సిక్వెల్ ప్లాప్ అయినా కూడా అంతే గుర్తుండిపోతుంది. అనుకోని కారణాల వలన ఇండియన్ 2 మూవీ విషయంలో అదే జరిగింది. దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు ఓటీటీ లో అయినా చూడాలని డిసైడ్ అయ్యారు. తాజాగా మూవీ ఓటీటీ ఎంట్రీ పై ఓ క్లారిటీ వచ్చేసింది.

శంకర్ , కమల హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ గురించి.. రిలీజ్ కు ముందు ఎలాంటి టాక్ వినిపించిందో.. అది రిలీజ్ తర్వాత లేదు. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విధంగా ప్లాప్ అయింది. మౌత్ టాక్ లేకపోవడంతో.. థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసే పీపుల్ కౌంట్ తగ్గిపోయింది. దీనితో అసలు సినిమా గురించి తెలియని వాళ్ళు.. ప్లాప్ టాక్ ఎందుకు వచ్చిందో అని తెలుసుకుందాం అనుకునే వాళ్లంతా.. ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ డేట్ విషయంలో కూడా చాలానే డిస్కషన్స్ జరిగిన తర్వాత.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇండియన్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా.. ఆగష్టు 9 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఇండియన్ 2 మూవీ కథ విషయానికొస్తే.. చిత్ర అరవిందన్ అనే ఓ నార్మల్ యూట్యూబర్..తన ఫ్రెండ్స్ తో కలిసి సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తూ.. న్యాయం కోసం పోరాడుతూ ఉంటాడు. కానీ వీరికి ఆ అన్యాయాలను ఎదుర్కునే శక్తీ సరిపోదు. దీనితో సోషల్ మీడియాలో వీరంతా కలిసి “కమ్ బ్యాక్ ఇండియన్” అనే ట్రెండ్ ను క్రియేట్ చేస్తారు. ఈ విషయం కాస్త విదేశాల్లో ఉండే కమల్ హాసన్ వరకు చేరి..అతను ఇండియాకు తిరిగి వస్తాడు. రావడం రావడంతోనే ఓ హత్య చేసి.. యువతలో ఓ సందేశాన్ని తెలియజేస్తాడు. దీనితో దేశంలోనే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కమల్ హాసన్ యువతకు ఇచ్చిన సందేశం ఏంటి ? సమాజంలో వారు కోరుకున్న మార్పు వచ్చిందా లేదా ? మూవీ కథను ఎలా ఎండ్ చేశారు అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.