iDreamPost
android-app
ios-app

భారతీయుడు-2 OTT స్ట్రీమింగ్ విషయంలో భారీ షాక్.. కారణం ఇదే

  • Published Jul 31, 2024 | 4:59 PM Updated Updated Jul 31, 2024 | 4:59 PM

Bharateeyudu 2 OTT Update: కొత్త సినిమాలు థియేటర్స్ లోకి రాగానే.. ఓటీటీ సంస్థలు పోటీ పడి మరీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయుడు-2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొత్త న్యూస్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Bharateeyudu 2 OTT Update: కొత్త సినిమాలు థియేటర్స్ లోకి రాగానే.. ఓటీటీ సంస్థలు పోటీ పడి మరీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయుడు-2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొత్త న్యూస్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 31, 2024 | 4:59 PMUpdated Jul 31, 2024 | 4:59 PM
భారతీయుడు-2 OTT స్ట్రీమింగ్  విషయంలో భారీ షాక్.. కారణం ఇదే

కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ భారతీయుడు-2 మూవీ మీద.. రిలీజ్ కు ముందు చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను జూలై 12న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. కానీ అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మూవీ విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఈ మూవీ గురించి.. నెగెటివ్ టాక్ రావడంతో.. లాంగ్ రన్ లో కూడా ఎక్కడా టాక్ ను మార్చుకోలేకపోయింది. ఇక థియేటర్ లో ఈ సినిమా హిట్ కాకపోవడంతో.. కనీసం ఓటీటీ లో అయినా ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంటుందేమో అని అనుకున్న మేకర్స్ కు.. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొత్త న్యూస్ వినిపిస్తుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భారతీయుడు-2 మూవీ.. 250 కోట్ల బిజినెస్ టార్గెట్ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటివరకు ఈ మూవీ.. 146.58 కోట్ల కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. అయితే ఇప్పడు ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిన తర్వాత.. కొత్త సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఓటీటీ సంస్థలు పోటీ పడి మరీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయుడు-2 మూవీకి రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ అవ్వడంతో.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ను.. 120 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్ లో ఈ మూవీ సక్సెస్ కాలేకపోవడంతో త్వరలోనే ఈ మూవీ ఓటీటీ లోకి రానున్నట్లు కూడా రెండు మూడు స్ట్రీమింగ్ డేట్స్ కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ప్రకారం భారతీయుడు-2 ఓటీటీ స్ట్రీమింగ్ కష్టమే అనిపిస్తుంది.

ఈ మూవీ అనుకోని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మధ్య థియేటర్ లో హిట్ కానీ చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను మాత్రం మెప్పిస్తున్నాయి. కానీ భారతీయుడు-2 విషయంలో మాత్రం ఇది జరిగేలా కనిపించడం లేదు. ఓటీటీ లో కూడా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం లేక.. నెట్ ఫ్లిక్స్ ముందు కుదుర్చుకున్న డీల్ కు భారతీయుడు-2 మూవీని కొనుగోలు చేసేలా లేదని సమాచారం. ప్రస్తుతం మూవీ డిజిటల్ రైట్స్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరి నెట్ ఫ్లిక్స్ ఈ డీల్ ను క్యాన్సిల్ చేస్తుందా లేదా తక్కువ ధరకైనా కొనుగోలు చేస్తుందా అనే విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు మేకర్స్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.