iDreamPost
android-app
ios-app

Bhaje Vaayu Vegam OTT: భజే వాయు వేగం మూవీ OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్ ..

  • Published Jun 03, 2024 | 11:16 AM Updated Updated Jun 03, 2024 | 11:16 AM

ఓటీటీ లో చిత్రాలకు ఆదరణ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయినా చిత్రాలు వెంటనే వాటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ ను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయినా ఓ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఇదేనంటూ టాక్ వినిపిస్తుంది.

ఓటీటీ లో చిత్రాలకు ఆదరణ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయినా చిత్రాలు వెంటనే వాటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ ను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయినా ఓ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఇదేనంటూ టాక్ వినిపిస్తుంది.

  • Published Jun 03, 2024 | 11:16 AMUpdated Jun 03, 2024 | 11:16 AM
Bhaje Vaayu Vegam OTT: భజే వాయు వేగం మూవీ OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్  ..

ఇప్పుడు ఓటీటీ సినిమాలకు ఏ రేంజ్ లో ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఆయా సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తున్నాయి. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే టాక్ వినిపించేది. దానికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు థియేటర్ లో ఆయా సినిమాలు రిలీజ్ అయిన వెంటనే వాటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కన్ఫర్మ్ అయిపోయి.. అవి ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతాయి అనే అంచనాలు కూడా స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే.. తాజాగా కార్తికేయ నటించిన సినిమా ‘భజే వాయు వేగం’ . ఈ సినిమా మే 31 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక అప్పుడే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి టాక్ వినిపించేస్తుంది.

హీరో కార్తిజేయ నటించిన తాజా సినిమా “భజే వాయు వేగం”. ఈ సినిమా మే 31 న ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లో రిలీజ్ అయింది. అదే రోజు రిలీజ్ అయినా మిగిలిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే.. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో నటుడు కార్తికేయతో పాటు ఐశ్వర్య మీనన్‌, రాహుల్‌ టైసన్‌, తనికెళ్ల భరణి, రవిశంకర్‌, శరత్‌ లోహితస్వ, రూపలక్ష్మి లాంటి వారు ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ సినిమాకు ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించారు. థియేటర్ లో డీసెంట్ టాక్ సంపాదించుకుంటున్న ఈ సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సిసొంతం చేసుకుంది.

Bhaje Vaayu Vegam

ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఓటీటీ లవర్స్ కు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఓ క్రికెటర్ కావాలని అనుకుంటూ ఉంటాడు. మంచి ఇల్లు కుటుంబం అంతా బాగానే ఉన్నా కూడా.. అకస్మాత్తుగా పెరిగిన అప్పుల భాధ వలన.. అతని తల్లి దండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. దీనితో ఒక్కసారిగా అతని జీవితం అంతా తారుమారు అవుతుంది. దీనితో అతని తండ్రి స్నేహితుని కుటుంబం ఇతనిని ఆదుకుంటుంది. అప్పటికే వారి ఇంట్లో ఓ కొడుకు ఉంటాడు, దీనితో ఇద్దరినీ సమానంగానే పెంచుతారు ఆ ఫ్యామిలీ. కట్ చేస్తే మరొక సీన్ లో హైదరాబాద్ మేయర్ కొడుకుతో.. ఈ ఇద్దరి అన్నదమ్ములకు ఓ గొడవ జరుగుతుంది. అనుకోకుండా ఓ రోజు ఆ మేయర్ కొడుకు శవం తన తమ్ముడి కార్ లో దొరుకుతుంది. ఇక అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. హీరో కు ఆ హత్యకు ఎమన్నా సంబంధం ఉందా ! అసలు మేయర్ కొడుకు ఎలా చనిపోయాడు ! ఈ హత్య కేసు నుంచి బయట పడ్డారా లేదా ! చివరికి ఎలా ముగిసింది! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.