Swetha
Today OTT Series Suggestion: థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఓ లెక్క.. OTT లో రిలీజ్ అయ్యే సినిమాలు మరో లెక్క . ఎప్పటికప్పుడు OTTలో కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. అయినా సరే ఒక్కోసారి ప్రేక్షకులు కొన్ని మంచి మూవీస్ ని మిస్ అవుతూ ఉంటారు. మీరు మిస్ అయిన సినిమాల్లో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

OTT లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో ఆడియన్స్ అప్పుడప్పుడు కొన్ని మంచి థ్రిల్లర్ సిరీస్ లను మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని కనుక మిస్ అయ్యి ఉంటె ఓ మంచి హార్ట్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ మిస్ అయినట్లతే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.
అసలు ఈ సిరీస్ ఏంటి అనే విషయానికొస్తే.. ఈ మూవీలో ఒక 828 నంబర్ గల ఫ్లైట్ జమైకా నుండి, న్యూయార్క్‌కు బయలుదేరుతుంది. ల్యాండింగ్ సమయంలో కాస్త ప్రాబ్లమ్ ఫేస్ చేసినా కానీ చివరికి సేఫ్ గానే ల్యాండ్ అవుతుంది. అలా ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ కు ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే వారు ఆ ఫ్లైట్ లో ట్రావెల్ చేసింది కొన్ని గంటలే అయినా కూడా బయట ప్రపంచంలో 5 సంవత్సరాలు గడిచిపోతాయి. వారి స్నేహితులు కుటుంబ సభ్యులు అంతా ఐదు సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఈ ఫ్లైట్ లో ట్రావెల్ చేసిన వారు మాత్రం అదే ఏజ్ లో ఆగిపోతారు. అసలు ఇదెలా సాధ్యపడింది ? విమానంలో ఏమి జరిగింది ? అక్కడ ఏదైనా అదృష్ట శక్తులు ఉన్నాయా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఈ సిరీస్ పేరు “మ్యానిఫెస్ట్”. ఈ సిరీస్ 2018 లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ స్టోరీని ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.