iDreamPost

బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. OTTలో కాదు, ఫ్రీగా యూట్యూబ్‌లో చూడొచ్చు!

గత కొంత కాలంగా రియల్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీస్ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కథ తెలిసినా కూడా.. కథనం ఎలా ఉంటుందన్న ఆసక్తి కొద్దీ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు అలాంటి ఓ మూవీ ఫ్రీగా చూసొయొచ్చు.

గత కొంత కాలంగా రియల్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీస్ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కథ తెలిసినా కూడా.. కథనం ఎలా ఉంటుందన్న ఆసక్తి కొద్దీ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు అలాంటి ఓ మూవీ ఫ్రీగా చూసొయొచ్చు.

బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. OTTలో కాదు, ఫ్రీగా యూట్యూబ్‌లో చూడొచ్చు!

వాస్తవిక సంఘటనల ఆధారంగా పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటికి బాగా ఆదరణ లభిస్తుంది. ఇటీవల వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో అందరికీ ఎరుకే. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయినా రియల్ స్టోరీస్  విషయంలో మార్పులు చేసేందుకు దర్శక నిర్మాతలు పెద్దగా కష్టపడనవసరం లేదు. అయితే తెలిసిన కథను ప్రేక్షకులను కట్టిపడేసేలా తెరకెక్కించడమే కత్తిమీద సాములాంటి వ్యవహారం. కథ తెలిసినా, కథనం మీదే సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డైరెక్టర్ తడబడితే సినిమా బెడిసికొట్టినట్లే. ముఖ్యంగా క్రైమ్ కథను తెరకెక్కించేటప్పుడు పిన్ టు పిన్ జాగ్రత్త వహించాల్సిందే.

అలాంటి ఓ పరభాష క్రైమ్ కథా చిత్రాన్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. ఈ సినిమా చూడకుంటే.. వెంటనే గో అండ్ వాచ్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన హిందీ మూవీ వెల్ కమ్ హోమ్. 2020లో డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ అయ్యింది. కాశ్మీర్ ఇరానీ, స్వర్థ తీగలే, బోలోరాం దాస్, టీనా భాటియా ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ , ఆయ భార్య స్వరూప్ రావల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్కర్ మహాబల్ దర్శకత్వం వహించగా.. మేఘదీప్ బోస్ సంగీతం అందించాడు.ఈ మూవీ కరోనా టైంలో డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. సోనీలివ్‌లో రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈ మూవీ అందులో లేవు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా సోనీ లివ్ నుండి తొలగించినట్లు తెలుస్తుంది.

మరీ ఎలా అనుకుంటున్నారా.. యూట్యూబ్‌లో ప్రస్తుతం లభిస్తుంది. ఈ సినిమా పేరు సెర్చ్ చేస్తే.. ఓ యూట్యూబర్ పేరుతో అప్ లోడ్ అయ్యి కనిపిస్తుంది. ఇద్దరు గవర్నమెంట్ టీచర్లైన అనుజ (కాశ్మీరా ఇరానీ), నేహా (స్వర్దా తీగలే) జనాభా లెక్కల కోసం జనాభా డేటాను సేకరించే పనిలో ఉంటారు. ఇందులో భాగంగా ఓ నిర్జన ప్రాంతంలో ఉన్న ఇంటికి వెళతారు. అందులో ప్రేరణ (టీనా భాటియా) అనే గర్భిణీ వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. . డేటాను సేకరించడానికి వెళుతున్నప్పుడు, వారు నిర్జన ప్రాంతంలో ఇంటిని చూస్తారు, అక్కడ ప్రేరణ (టీనా భాటియా) అనే గర్భిణీ స్త్రీ వారిని ఇంట్లోకి పిలుస్తుంది. గర్భిణిపై చాలా కాలంగా లైంగిక దాడి జరుగుతుందని గుర్తిస్తారు. అలాగే ఆ ఇంట్లో వ్యక్తులు కూడా వింతగా ప్రవర్తిస్తుంటారు. అక్కడకు వెళ్లాక వారికి ఎదురైన అనుభవాలు ఏంటీ. వారు ఆ ఇంట్లో నుండి తప్పించుకున్నారా లేదా అనేది మిగిలిన కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి