iDreamPost
android-app
ios-app

Bastar:The Naxal Story OTT: OTT లోకి అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published May 08, 2024 | 4:06 PM Updated Updated May 08, 2024 | 4:06 PM

ఆదా శర్మ నటించిన మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఆదా శర్మ నటించిన మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published May 08, 2024 | 4:06 PMUpdated May 08, 2024 | 4:06 PM
Bastar:The Naxal Story OTT: OTT లోకి అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

రియల్ స్టోరీస్ ను ఇష్టపడే ప్రేక్షకులను గుడ్ న్యూస్.. ఎందుకంటే ఓటీటీ లోకి మరొక కొత్త సినిమా వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ మధ్య కాలంలో సర్వైవల్ థ్రిల్లర్స్, రియల్ డ్రామాస్, హిస్టారికల్ డ్రామాస్ వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్స్ పైన వచ్చిన సినిమాలన్నిటికీ కూడా మంచి ఆదరణ లభించాయి. దీనితో మేకర్స్ కూడా ఆయా సినిమాలపైన ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయింది. మరి ఆ సినిమా ఏంటో ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో పూర్తి వివరాలను చూసేద్దాం.

ఈ సినిమాకి మరేదో కాదు.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన “బస్తర్: ది నక్సల్ స్టోరీ”. ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయింది. కానీ, ఈ సినిమా మాత్రం థియేటర్స్ లో అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 15 న రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా మే 17 వ తేదీ నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు.. జీ 5 అధికారికంగా ప్రకటించింది. “సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, భీకర ఫైటర్ ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ).. నక్సలిజాన్ని అరికట్టేందుకు వస్తున్నారు. మే 17న బస్తర్ జీ5లో హిందీ, తెలుగులో ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ట్వీట్ చేసింది. పైగా ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోను స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఓటీటీ లో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోనుందో వేచి చూడాలి.

ఇక బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమా కథ విషయానికొస్తే… నక్సలైట్స్ కార్యకలాపాలు, దాడుల గురించి ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. నక్సలైట్ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి చెందడం. ఆ తర్వాత నక్సలైట్స్ ను అడ్డుకునేందుకు అదా శర్మ రంగంలోకి దిగడం.. వాళ్ళపై ఈమె ఏ విధంగా పోరాటం చేసింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా థియేటర్ లో విడుదలైన మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే, థియేటర్ లో కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ సంపాదించుకున్నా కూడా.. ఓటీటీ లో మాత్రం దూసుకుపోతుంటాయి. ఈ సినిమా కూడా అలానే అవుతుందేమో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.