Krishna Kowshik
Bahishkarana Web Series.. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంటోంది తెలుగు అమ్మాయి అంజలి. గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో అలరించిన అంజలి.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌తో రాబోతుంది. స్ట్రీమింగ్ డేట్ ఎనౌన్స్ చేసింది సదరు ఓటీటీ సంస్థ.
Bahishkarana Web Series.. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంటోంది తెలుగు అమ్మాయి అంజలి. గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో అలరించిన అంజలి.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌తో రాబోతుంది. స్ట్రీమింగ్ డేట్ ఎనౌన్స్ చేసింది సదరు ఓటీటీ సంస్థ.
Krishna Kowshik
టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది తెలుగు అమ్మాయి అంజలి. దాదాపుగా 18 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో రాణిస్తుంది ఈ వర్సటైల్ యాక్ట్రెస్. ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఆమె తొలి చిత్రం ఫోటో నుండి తాజాగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వరకు డిఫరెంట్ రోల్స్ చేస్తూ ..స్టార్ నటిగా కొనసాగుతోంది. ఇప్పుడు సెటిల్డ్ ఫెర్మామెన్స్‌తో చించేస్తుంది. నిడివి తక్కువగా ఉన్నా పవర్ ఫుల్ పాత్రలను ఎంచుకుని ముందుకు సాగుతుంది. ఈ ఏడాది గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో అలరించిన అంజలి.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఇందులో ఛాలెంజింగ్ రోల్లో కనిపించబోతుంది. మరోసారి వేశ్య పాత్రలో నటించబోతుంది ఈ నటి. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలకు మారు పేరుగా మారింది అంజలి. గత కొంత కాలంగా కథతో పాటు తన క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండాలని భావిస్తుంది. అలాంటి పాత్రలకే సై అంటోంది. సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటోంది. నవరస, ఝాన్సీ, ఫాల్ వంటి వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంది. ఇప్పడు బహిష్కరణ అనే సిరీస్‌తో రాబోతుంది. జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీన్ని జీ 5 ఓటీటీ సంస్థతో కలసి పిక్సెల్ పిక్చర్స్ ఇండియా పతాకంపై తెరకెక్కింది. దర్శకుడు ముఖేష్ ప్రజాపతి తెరకెక్కించాడు. జులై 19 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది సదరు ఓటీటీ సంస్థ. కాగా, దీనిపై అంజలి మాట్లాడుతూ.. ఇందులో తాను పుష్ప క్యారెక్టర్ చేశానని, ఓ అమాయకురాలైన వేశ్య నుండి ధైర్యవంతురాలిగా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా ని చెప్పింది.
గ్రామీణ నేపథ్యంలో.. ఓ రివేంజ్ డ్రామా తెరకెక్కింది బహిష్కరణ. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక ఈ మూవీ దర్శకుడు ఈ ప్రజాపతి మాట్లాడుతూ.. కథ, కథనాలు శక్తివంతంగా ఉంటాయని, లోతైన భావోద్వేగాలున్నాయిని.. ఈ సిరీస్ నచ్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సముద్రం అంత ప్రశాంతంగా ఉండే వ్యక్తి జోలికి ఎవరైనా వస్తే… ఎంత వినాశనం జరుగుతుంది? ఎటువంటి పరిస్థితులు ఎదురు అవుతాయి? అనేది చూపించామన్నారు. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘బహిష్కరణ’లో రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, అనన్యా నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, ‘బేబీ’ చైత్ర కీలక పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించగా.. పిక్సెల్ పిక్చర్స్ ఇండియా పతాకంపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. జులై 19 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
A tale of misused power and enraged beauty.
Get ready for #Bahishkarana on 19th July#BahishkaranaOnZee5 @PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @yoursanjali @AnanyaNagalla @RavindraVijay1 @prasannadop @SidharthSadasi1 pic.twitter.com/bvtplrLhgV— ZEE5 Telugu (@ZEE5Telugu) July 4, 2024