Swetha
ఇప్పుడు ఓటీటీ లో ఉన్న సినిమాలను చూసేస్తే.. కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాయి. ఈ క్రమంలో మరొక యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి ఆ సినిమా ఏంట చూసేద్దాం.
ఇప్పుడు ఓటీటీ లో ఉన్న సినిమాలను చూసేస్తే.. కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాయి. ఈ క్రమంలో మరొక యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి ఆ సినిమా ఏంట చూసేద్దాం.
Swetha
ఎన్నో సినిమాలు ఓటీటీ లో సందడి చేసేందుకు రెడీ అయిపోతున్నాయి. థియేటర్ లో చూసేందుకు కొత్త సినిమాలు లేకపోయినా కూడా ఓటీటీ లో మాత్రం సినిమాలకు కొదవ లేదు. అందుకే రాను రాను ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోతుంది. దీనితో మేకర్స్ కూడా ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ.. జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ సినిమాలను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లో ఉన్న సినిమాలు చూసేస్తే కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.
ఇప్పుడు ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాల కోసం మాత్రం వెయిట్ చేయడం లేదు. దాదాపు అన్ని భాషల చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన.. బాలీవుడ్ ముల్టీస్టారర్ యాక్షన్ మూవీ.. “బడే మియా ఛోటే మియా”. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఖాతాలో ఎటువంటి హిట్స్ పడలేదు. దీనితో ఈ సినిమాతో అయినా అక్షయ్ ఖాతాలో మరొక హిట్ పడుతుంది అనుకున్నారు అంతా.. కానీ ఈసారి కూడా అక్షయ్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమా థియేటర్ లో విడుదలైన మొదటి షో నుంచి నెగెటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ చాలా వరకు ఈ మధ్య వస్తున్న సినిమాలు థియేటర్ లో మెప్పించకపోయిన ఓటీటీ లో మాత్రం మెప్పిస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫిక్స్ లో జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక బడే మియా ఛోటే మియా కథ విషయానికొస్తే.. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కూడా ఇండియన్ ఆర్మీలో సైనికులుగా పనిచేస్తూ ఉంటారు. శత్రువులు చేస్తున్న కుట్రలను.. తమ ప్రాణాలకు తెగించి మరి యుద్ధం చేస్తారు. ఈ క్రమంలో తప్పుడు ఆరోపణలు కారణంగా వారి ఇద్దరి ఉద్యోగాలు పోతాయి. కట్ చేస్తే… కబీర్ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీకు చెందిన ఓ వెపన్ ను డోనాగలించి లండన్ కు తరలిస్తాడు. ఆ వెపన్ ను తిరిగి ఇండియన్ ఆర్మీకి అప్పగించే భాధ్యతను అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తీసుకుంటారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ ను వారిద్దరూ ఎలా సక్సెస్ చేశారు ? ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి ? అనేది ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.