iDreamPost
android-app
ios-app

OTTలోకి పొలిమేర తరహా హారర్ మూవీ.. ఒక్కో సీన్‌కి వణికిపోతారు!

  • Published Apr 30, 2024 | 4:00 PM Updated Updated Apr 30, 2024 | 4:00 PM

థియేటర్లలో రిలీజై పట్టుమని నెల రోజులు కూడా కావడం లేదు.. ఓటీటీల బాట పడుతున్నాయి. దీంతో థియేటర్లలో ఈ మూవీని మిస్ అయ్యామన్న ఫీల్ కలగట్లేదు మూవీ ప్రియులకు. తాజాగా మరో చిత్రం ఓటీటీలోకి కామ్ గా వచ్చేసింది.

థియేటర్లలో రిలీజై పట్టుమని నెల రోజులు కూడా కావడం లేదు.. ఓటీటీల బాట పడుతున్నాయి. దీంతో థియేటర్లలో ఈ మూవీని మిస్ అయ్యామన్న ఫీల్ కలగట్లేదు మూవీ ప్రియులకు. తాజాగా మరో చిత్రం ఓటీటీలోకి కామ్ గా వచ్చేసింది.

  • Published Apr 30, 2024 | 4:00 PMUpdated Apr 30, 2024 | 4:00 PM
OTTలోకి పొలిమేర తరహా హారర్ మూవీ.. ఒక్కో సీన్‌కి వణికిపోతారు!

సినీ లవర్స్‌ను ప్రతి వారం ఎంటర్‌టైన్ చేస్తున్నాయి ఓటీటీ మూవీస్. డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు ప్రేక్షకులను వీకెండ్ టీవీ లేదా మొబైల్స్‌కు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. నెల తిరగకుండానే సినిమాలు వచ్చేస్తుండటంతో థియేటర్లలో మిస్ అయ్యామన్న ఫీల్ కూడా ఉండటం లేదు మూవీ ప్రియులకు. టాలీవుడ్ చిత్రాలే కాదు భాషతో సంబంధం లేకుండా సినిమాలను వాచ్ చేస్తున్నారు. తెలుగులో లేకపోయినా.. సబ్ టైటిల్స్‌తో కవర్ చేసేస్తున్నారు. మూవీ బాగుంటే.. నలుగురికి చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. బాగోకపోతే జస్ట్ బాగోలేదని చర్చించుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఓ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది.

శాండిల్ వుడ్ నుండి వచ్చిన మరో బ్యూటీ ఆషికా రంగనాథ్. అమిగోస్ చిత్రంలో మెరిసి.. నా సామి రంగాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆషికా.. కన్నడలో వరుస హిట్లతో దూసుకెళుతుంది. ఆమె తాజాగా నటించింన చిత్రం అవతార పురుష్ 2. 2022లో వచ్చిన అవతార పురుషకు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. శరణ్ హీరోగా నటించిన ఈ సినిమాను సుని డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్ ఒకప్పటి స్టార్ నటుడు సాయి కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. పస్టాఫ్ హిట్‌గా నిలవగా, అవతార పురుష్ 2 మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.  సైలెంట్‌గా వచ్చేసి సందడి చేస్తోంది.

ఏప్రిల్ 5న రిలీజైన ఈ మూవీ మంగళవారం నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అంటే కేవలం 25 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసి ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం కన్నడ భాషలో లభిస్తుంది. భవిష్యత్తులో తెలుగులో కూడా అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి.  ఇక కథ విషయానికి వస్తే.. దుష్త శక్తుల నుండి త్రిశంకు మణిని అనిల అలియాస్ కర్ణ (శరణ్) ఎలా కాపాడాడు.? ఆ ప్రయత్నంలో సిరి (ఆషికా రంగనాథ్) ఎలా అండగా నిలిచింది అనేది కథ.  హారర్ అండ్ బ్లాక్ మ్యాజిక్ మూవీగా వచ్చింది. ట్రైలర్ మంచి రెస్సాన్స్ అందుకుంది. దీంతో భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే హారర్ ఎలిమెంట్స్, విజువల్ వండర్స్ కాస్త మెప్పించాయి. ఇదే నెలలో ఆషికా మరో సినిమా కూడా రిలీజైంది. ఓ2 అనే ఎక్స్‌పర్ మెంటల్ చిత్రంతో పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ప్రస్తుతం గత వైభవ అనే చిత్రంలో నటిస్తోంది ఆమె.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom