iDreamPost
android-app
ios-app

OTT Crime Thriller : OTT లోకి రీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jul 31, 2024 | 12:30 AM Updated Updated Jul 31, 2024 | 12:30 AM

కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వచేస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం.. కాస్త ఆలస్యంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా థియేటర్ లో రిలీజ్ అయినా మూడున్నర నెలల తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుంది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వచేస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం.. కాస్త ఆలస్యంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా థియేటర్ లో రిలీజ్ అయినా మూడున్నర నెలల తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుంది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

  • Published Jul 31, 2024 | 12:30 AMUpdated Jul 31, 2024 | 12:30 AM
OTT Crime Thriller : OTT లోకి  రీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

కొన్ని సినిమాలు థియేటర్ లో ఎలాంటి టాక్ సంపాదించుకున్నా కానీ.. ఓటీటీ లోకి మాత్రం వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. అటు ఇటుగా నెల రెండు నెలల లోపే ఓటీటీ లో ఎంట్రీ ఇస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎందుకో చాలా ఆలస్యం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అంతే. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా మూడున్నర నెలల తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ మరేదో కాదు.. అగ్నిసాక్షి సీరియల్ , బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి నటించిన “తెప్ప సముద్రం”. మరి ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు రాబోతుంది.. ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేయండి.

అర్జున్ అంబటి హీరోగా నటించిన తెప్ప సముద్రం మూవీ.. ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాను సతీష్ రాపోల్ డైరెక్ట్ చేయగా.. అర్జున్ అంబటితో పాటు.. చైతన్య రావు కూడా లీడ్ రోల్ లో నటించారు. అయితే ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. మరి ఓటీటీ లో రిలీజ్ చేయడానికి ఇంత టైమ్ ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ.. ఇప్పుడు ఓటీటీ లలో థియేటర్ లో హిట్ కానీ సినిమాలన్నీ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకునే అవకాశం లేకపోలేదు. ఇక ఈ సినిమాను ఆగష్టు 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఇక తెప్ప సముద్రం మూవీ కథ విషయానికొస్తే.. ఇదొక మర్డర్ మిస్టరీ.. తెలంగాణలోని తెప్ప సముద్రం అనే ప్రాంతంలో తరచూ.. చిన్న పిల్లలు మాయం అవ్వడం , ఆ తర్వాత అనుమానాస్పదంగా వారు చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్నారులపై అత్యాచారం చేసి.. హత్య చేసే ఓ సైకో కిల్లర్ కథే ఈ సినిమా.. ఆ హత్యలు చేస్తున్నది ఎవరో తెలుసుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ , ఓ న్యూస్ రిపోర్టర్ , ఒక ఆటో డ్రైవర్ కలిసి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ? ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి ? అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.