iDreamPost

ఉద్యోగం చేసే ఆడవాళ్లు చూడాల్సిన మూవీ.. OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్..

ఇటీవల కాలంలో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అన్న క్యూరియాసిటీతో తెరకెక్కిన సినిమాలు సినీ ప్రియుల్ని ఓటీటీలకు కట్టిపడేసేలా చేస్తున్నాయి. అలాంటి ఓ మూవీ ఓటీటీలో ఉంది చూసేయండి.

ఇటీవల కాలంలో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అన్న క్యూరియాసిటీతో తెరకెక్కిన సినిమాలు సినీ ప్రియుల్ని ఓటీటీలకు కట్టిపడేసేలా చేస్తున్నాయి. అలాంటి ఓ మూవీ ఓటీటీలో ఉంది చూసేయండి.

ఉద్యోగం చేసే ఆడవాళ్లు చూడాల్సిన మూవీ.. OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్..

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు కొదవ లేదు. సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. వాట్ నెక్ట్స్ అన్న క్యూరియాసిటీతో ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి ఈ జోనర్‌కు చెందిన సినిమాలు. సాధారణంగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే.. హీరోలు మాత్రమే సాల్వ్ చేస్తుంటారు. హీరోయిన్లకు అవకాశం ఉండదు. కానీ ఇందులో హీరోయిన్నే.. తనకు వచ్చిన సమస్యను తానే సాల్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఉద్యోగాల పేరిట బయటకు వెళ్లిన ఆడ పిల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఎలాంటి మాయలో పడిపోతారు అనే విషయానికి ఫర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. వాస్తవిక కోణంలో తెరకెక్కించిన ఈ మూవీ ఓటీటీలో ఉంది. ఈ వారంలో మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే.. ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్పచ్చు. సినిమా అస్సలు నిరాశ కలిగించదు. ఆ మూవీనే ఫర్హానా

లేడీ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది ఐశ్వర్య రాజేష్. తాత, తండ్రి నుండి నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య.. అచ్చ తెలుగు అమ్మాయన్న విషయం అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు రాజేశ్ కూతురే ఐశ్వర్య. తండ్రి చిన్న వయస్సులోనే చనిపోవడంతో.. చదువులు పూర్తయ్యాక.. నటనలోకి అడుగుపెట్టింది. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ నటి అయ్యింది. తెలుగులో కూడా అడపాదడపా సినిమాలు చేసింది. కౌశల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. త్వరలో వెంకటేశ్ సరసన నటిస్తోంది. కాగా, గత ఏడాది ఐశ్వర్య.. ఫర్షానా అనే ఉమెన్ సెంట్రిక్ చిత్రం చేయగా.. సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్.

ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే.. ఫర్హానా (ఐశ్వర్య రాజేష్)ఓ మధ్య తరగతి మహిళ. ఆమె తన తండ్రి, భర్త కరీమ్ (జీతన్ రమేష్)లతో జీవిస్తుంటుంది. సంప్రదాయాలకు విలువనిచ్చే ముస్లిం కుటుంబం ఆమెది. అయితే తండ్రి, భర్త చేస్తున్న చెప్పుల వ్యాపారం సరిగా నడవక.. ఆర్థికంగా ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకురాలేకపోతుంది ఫర్హానా. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి వెళుతుంది. ఆమె ఫ్రెండ్ సాయంతో ఓ కాల్ సెంటర్‌లో జాయిన్ అవుతుంది. అనతి కాలంలోనే ఆమె కంపెనీలో మంచి పేరు తెచ్చుకుంటుంది. అయితే డబ్బులు ఎక్కువ వచ్చే ఫ్రెండ్షిప్ చాట్ సెంటర్‌లో జాయిన్ అవుతుంది. అక్కడ ఇషా అనే పేరుతో మాట్లాడుతుంది. తొలుత ఆమెకు ఇబ్బంది అనిపించగా.. ఒక్క కాల్ ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. అప్పుడే ఆమెకు దయాకర్ (సెల్వ రాఘవన్)నుండి కాల్ వస్తుంది. అతడి మాటలకు మంత్ర ముగ్దురాలైన ఫర్హానా..తన కష్టాలను చెప్పుకుంటుంది. ఇక అక్కడ నుండి అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు దయాకర్.. ఈ విషయం భర్తకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ఈ సమస్య నుండి ఎలా బయటపడింది అన్నది మిగి లిన కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి