Keerthi
Haraa Movie OTT: అలనాటి కోలీవుడ్ హీరో మోహన్ దాదాపు 16 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోహన్ హీరోగా నటించిన 'హరా' మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకి ఎప్పుడంటే..?
Haraa Movie OTT: అలనాటి కోలీవుడ్ హీరో మోహన్ దాదాపు 16 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోహన్ హీరోగా నటించిన 'హరా' మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకి ఎప్పుడంటే..?
Keerthi
కోలీవుడ్ హీరో ‘మోహన్’.. ఈ పేరు తెలుగు ప్రేక్షేకులు అందరికీ సుపరిచితమే. ఎందుకుంటే.. ఈ హీరో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా 1980- 90దశకంలో ఎక్కువగా లవ్ స్టోరిల్లో నటించిన మోహన్ లవర్ బాయ్ గా తనదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగులో ఈ హీరో ఎక్కువగా బాపు, జంధ్యాల వంటి దర్శకుల సినిమాల్లో హీరోగా కనిపించారు. కాగా, వాటిలో తూర్పువెళ్లేరైలు, స్రవంతి, చూపులు కలిసిన శుభవేళ తో పాటు పలు సినిమిల్లో తెలుగు అడియాన్స్ కు మెప్పించాడు మోహన్.
ఇకపోతే తమిళ్ మాత్రం ఈ హీరో వందకు పైగా సినిమాల్లో అలరించాాడు. ఇక రచివరిగా ఈయన తమిళ్ లో 2008లో రిలీజ్ అయిన ‘సుట్ట ఫజమ్’ సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..దాదాపు పదహారేళ్ల తర్వాత ఈ హీరో మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ ‘హరా’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. కాగా, ఈ మూవీ గతనెల జూన్ 7వ తేదీన థీయేటర్లలో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంతకి ఎక్కడంటే..
తమిళ్ హీరో మోహన్ ఇటీవలే యాక్షన్ థ్రిల్లర్ మూవీ హరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీని దర్శకుడు విజయ్ శ్రీ జి తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమాలో అనుమోల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా గత నెల జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజై భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హరా సినిమా నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే హరా మూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన ఆహా స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఈనెల 5 నుంచి ఆహాలోని తమిళ్ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై స్వయంగా ఆహానే ఆఫీషియల్ గా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మోహన్‌తో పాట అనుమోల్, యోగిబాబు, చారుహాసన్ కీలక పాత్రల్లో నటించారు.
ఇక హరా మూవీ కథ విషయానికోస్తే.. హీరో రామ్ (మోహన్), నీలా (అనుమోల్) తన భార్యతో కలిసి ఊటీలో సంతోషంగా జీవిస్తుంటాడు. కాగా, వారికి నిమిషా (స్వాతి) అనే కూతురు ఉంటుంది.అయితే కోయంబత్తూర్‌లో చదివే నిమిషా ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక కూతురి మరణం వెనుక మెడికల్ మాఫియా ఉందనే నిజం రామ్‌కు తెలుస్తుంది. దీంతో ఆ మెడికల్ మాఫియాను ఎదురించడానికి దావూద్ ఇబ్రహీం గా రామ్ కొత్త అవతారం ఎత్తుతాడు . అయితే ఈ పోరాటంలో రామ్‌కు ఏమైంది? అసలు తన కూతురి మరణంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? సొసైటీలోని అవినీతిని నిర్మూలించాలనే రామ్ ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్నదే ఈ సినిమా కథ. మరి, రెండు రోజుల్లో హీరో మోహన్ తమిళ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.