iDreamPost
android-app
ios-app

OTT లోకి తెలుగులో రానున్న ‘తనావ్’ సీజన్ 2 థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Published Aug 21, 2024 | 12:29 PM Updated Updated Aug 21, 2024 | 12:29 PM

Action Thriller Series In Telugu Tanaav Season 2 OTT Details: ఏదైనా ఒక వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ సాధించిందంటే.. ఇక దానికి సిక్వెల్ సిరీస్ లు వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. తనావ్ కు సీజన్ 2 ను అనౌన్స్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

Action Thriller Series In Telugu Tanaav Season 2 OTT Details: ఏదైనా ఒక వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ సాధించిందంటే.. ఇక దానికి సిక్వెల్ సిరీస్ లు వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. తనావ్ కు సీజన్ 2 ను అనౌన్స్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

  • Published Aug 21, 2024 | 12:29 PMUpdated Aug 21, 2024 | 12:29 PM
OTT లోకి తెలుగులో  రానున్న ‘తనావ్’ సీజన్ 2 థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలకన్నా సిరీస్ లేక్ ఎక్కువ ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏదైనా ఓ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ సాధించిందంటే… దానికి సిక్వెల్ సిరీస్ లు వస్తూ ఉంటాయి. ఇక ఆ సీజన్స్ కూడా మంచి బజ్ ను సంపాదించుకుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తనావ్ కు.. సీజన్ 2 ను ప్రకటించారు మేకర్స్. కాశ్మీరీ ఉగ్రవాదం నేపథ్యంలో కొనసాగే ఈ సిరీస్ మొదటి సీజన్ ప్రేక్షకులను.. విపరీతంగా మెప్పించింది. ఇక ఇప్పుడు రెండవ సీజన్ ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

కాశ్మిరీ ఉగ్రవాదానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు, సిరీస్ అన్నీ కూడా.. ప్రేక్షకులకు తెలియని ఎన్నో నిజాలను పరిచయం చేశాయి. దీనితో ఈ ప్లాట్ లో వచ్చిన ప్రతి సినిమా , సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఈ క్రమంలో సోనీలివ్ లో వచ్చిన.. తనావ్ వెబ్ సిరీస్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండవ సీజన్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ సీజన్ లో కాశ్మిర్ లో ప్రజలు ఎదుర్కుంటున్న కొత్త సమస్యలు, అక్కడి వారిని కబీర్ అండ్ టీం ఎలా రక్షిస్తారు అనేది చూపించబోతున్నారు. కాగా తనావ్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ సెప్టెంబర్ 6 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మొదటి సీజన్ కథ విషయానికొస్తే.. ఐసిస్ లో శిక్షణ పొందిన అల్ డమిష్క్ అనే ఉగ్రవాది.. తన తండ్రి మరణానికి కారణం అయినా వాళ్ళపై పగ తీర్చుకోవడంతో పాటు.. ఇండియా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని.. దాడులు చేయాలనే లక్ష్యంతో కాశ్మిర్ కు వస్తాడు. తానూ అనుకున్నట్లుగానే ఓ బాంబు దాడితో 12మందిని చంపేస్తాడు. అసలు అతను అదంతా ఎందుకు చేశాడు .. అతని తండ్రి మరణానానికి కారణం ఎవరు అనేది మొదటి సీజన్. ఆ తర్వాత అతనిని పట్టుకోవడం కోసం ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగుతుంది. ఇక్కడి నుంచి రెండవ సీజన్ స్టార్ట్ అవుతుంది. స్పెషల్ టాస్క్ గ్రూప్ అల్ డమిష్క్ ను పట్టుకుంటుందా? కాశ్మిర్ ఎలాంటి కొత్త సమస్యలను ఎదుర్కొంటుంది ? ఆ తర్వాత ఏం జరిగింది అనేది రెండవ సీజన్ లో చూపించనున్నారు. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet