iDreamPost
android-app
ios-app

OTTలో 100 మిలియన్ వ్యూస్.. ఇంత మంచి మూవీ ఇంకా చూడలేదా?

  • Published May 19, 2024 | 6:21 PM Updated Updated May 19, 2024 | 6:21 PM

OTT Suggestions- Crazy Comedy Drama In OTT: మీరు ఈ మధ్యకాలంలో చాలానే సినిమాలు చూసుంటారు. కానీ ఒక మంచి కామెడీ లవ్ స్టోరీ చూశారా? చూసి ఉండరు అనే చెప్పాలి. అయితే ఓటీటీలో ఉన్న ఇంత మంచి మూవీని ఎందుకు ఇప్పటి వరకు చూడలేదు.

OTT Suggestions- Crazy Comedy Drama In OTT: మీరు ఈ మధ్యకాలంలో చాలానే సినిమాలు చూసుంటారు. కానీ ఒక మంచి కామెడీ లవ్ స్టోరీ చూశారా? చూసి ఉండరు అనే చెప్పాలి. అయితే ఓటీటీలో ఉన్న ఇంత మంచి మూవీని ఎందుకు ఇప్పటి వరకు చూడలేదు.

  • Published May 19, 2024 | 6:21 PMUpdated May 19, 2024 | 6:21 PM
OTTలో 100 మిలియన్ వ్యూస్.. ఇంత మంచి మూవీ ఇంకా చూడలేదా?

ఓటీటీలోకి ఈ మధ్యకాలంలో చాలానే సినిమాలు వచ్చాయి. కానీ, చాలా కొద్ది మూవీస్ మాత్రమే అభిమానుల ఆదరణ, ప్రేమ పొందాయి. వాటిలో ఈ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. పైగా తాజాగా ఈ మూవీ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ కి మించి దూసుకుపోతోంది. ఆ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే చాలా మంది ఈ మూవీని లైట్ తీసుకున్నారు. కానీ, ఓటీటీని షేక్ చేస్తోంది. పైగా ప్రముఖ కమెడియన్ హీరోగా చేసిన మూవీ ఇది. కథ పరంగా కూడా ఎంతో ఫన్నీగా సాగిపోయే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. ఇంకా ఎందుకు చూడలేదు మీరు?

మీరు ఇప్పటి వరకు చాలానే దొంగల సినిమాలు చూసుంటారు. వాటిలో సీరియస్ దొంగ, సిల్లీ దొంగలను చూసుంటారు. కానీ, ఇతను మాత్రం పార్ట్ టైమ్ దొంగ. ఉద్యోగం రాలేదని.. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసం అలా రాత్రుళ్లు దొంగతనం చేస్తుంటాడు. అలా ఒకసారి హీరోయిన్ ఉన్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. అయితే పాపం వెళ్లబోయో సమయానికి హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడంతో అంతా తలకిందులు అవుతుంది. అదే సమయానికి హీరోయిన్ ప్రియుడు రావడంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ఇష్టంలేని బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ కష్టాలు.. లైఫ్ లో సెటిల్ కావాలని మన దొంగ పడే కష్టాలు.

ఈ కథతో సంబంధం లేనట్లు ఇద్దరు లవర్స్.. హీరోయిన్ ని లైట్ తీసుకుంటూ ఉండే ఆమె ప్రియుడు ఇలా చాలానే యాంగిల్స్ లో ఈ కథ నడుస్తూ ఉంటుంది. కానీ, చాలా సింపుల్ స్టోరీ ఇది.  ఓటీటీలో ఇప్పటికే 100 మిలియన్స్ కి మించి వ్యూస్ సొంతం చేసుకుంది అంటే మీరే అర్థం చేసుకోవాలి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అని. మంచి స్టోరీ, జెన్యూన్ కామెడీ ఉంటే తెలుగు ప్రేక్షకులు మూవీని ఆదరిస్తారు అని మరోసారి రుజువైంది. ఇలా ప్రస్తుతం ఈ మూవీ నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా.. రికార్డుల మీద రికార్డులు కూడా బద్దలు కొడుతోంది. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా.. ఆ మూవీ మరేదో కాదు మై డియర్ దొంగ.

ఈ మూవీలో ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా చేశాడు. అలాగే హీరోయిన్ షాలినీ కొండెపూడి చేసింది. పైగా ఈ మూవీకి రైటర్ కూడా ఆమే కావడం విశేషం. మూవీలో పంచులు కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. మీరు గనుక ఈ మై డియర్ దొంగ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş