iDreamPost

Maharaj OTT : డైరెక్ట్ గా OTTలోకి ఆమిర్ ఖాన్ కుమారుడి డెబ్యూ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published May 29, 2024 | 1:22 PMUpdated May 29, 2024 | 1:22 PM

ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ చూసేసి.. ఇంకా ఏమైనా కొత్త సినిమాలు వస్తే బావుంటుందేమో అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం కొత్త కంటెంట్ రాబోతుంది. మరి ఆ సినిమా.. ఆ వివరాలేంటో చూసేద్దాం.

ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ చూసేసి.. ఇంకా ఏమైనా కొత్త సినిమాలు వస్తే బావుంటుందేమో అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం కొత్త కంటెంట్ రాబోతుంది. మరి ఆ సినిమా.. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published May 29, 2024 | 1:22 PMUpdated May 29, 2024 | 1:22 PM
Maharaj OTT : డైరెక్ట్ గా  OTTలోకి ఆమిర్ ఖాన్ కుమారుడి డెబ్యూ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పుడు ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, దీనితో వెండి తెరపై నటించిన బడా హీరోలు సైతం బుల్లి తెరపై నటించడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు. ఈ ఓటీటీ ద్వారానే స్టార్ హీరోలు తమ వారసత్వాన్ని ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారు కూడా. ఈ క్రమంలో ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్.. ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న సినిమా “మహారాజ్”. అయితే, ఈ సినిమాను థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ లోనే రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

జునైద్ ఖాన్ నటిస్తున్న “మహారాజ్” అనే ఈ చిత్రానికి సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించారు. కాగా, ఆదిత్య చోప్రా కు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాను రూపొందించింది. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించింది. ఇక వీరితో పాటు ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా ప్రధాన పాత్రలో కనిపించాడు. ఇక మహారాజ్ అనే ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. “ఓ శక్తివంతమైన వ్యక్తి, ఓ భయం లేని జర్నలిస్ట్ మధ్య నిజం కోసం జరిగే పోరాటం. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన మహరాజ్ జూన్ 14న రిలీజ్ కాబోతోంది. కేవలం నెట్‌ఫ్లిక్స్ లోనే” అనే ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ఈ సినిమా గురించి అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్.

అసలు మహారాజ్ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. ఈ సినిమా ఓ పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ డ్రామా ప్లాట్ లో తెరకెక్కించారు మేకర్స్. దీనిని 19వ శతాబ్దంలో జరిగిన ఓ కథగా చూపించారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు మేకర్స్. “1862లో ఇండియాలో కేవలం మూడు యూనివర్సిటీలు మాత్రమే ఉన్న సమయం.. అప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏడాది వయసు మాత్రమే.. 1857 సిపాయిల తిరుగుబాటు మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చరిత్రలో నిలిచిపోయే న్యాయ పోరాటంలో ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చొన్నాడు. ఆ నిజమైన స్టోరీ ఇప్పుడు 160 ఏళ్ల తర్వాత మహరాజ్ రూపంలో వెలుగులోకి వస్తోంది” అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి