iDreamPost

Aa Okkati Adakku OTT: ఆ ఒక్కడి అడక్కు మూవీ OTT లోకి రాబోయేది అప్పుడే.. కానీ !

  • Published May 28, 2024 | 6:23 PMUpdated May 28, 2024 | 6:23 PM

ఈ వారం ఓటీటీ మూవీస్ లిస్ట్ లో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ రప్పించేలా చెప్పుకోదగిన మూవీస్ ఏమి లేవు.. అనుకునే టైం కి.. ఇదిగో అంటూ ఓ తెలుగు సినిమా స్ట్రీమింగ్ కు సిద్ధం అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ మూవీస్ లిస్ట్ లో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ రప్పించేలా చెప్పుకోదగిన మూవీస్ ఏమి లేవు.. అనుకునే టైం కి.. ఇదిగో అంటూ ఓ తెలుగు సినిమా స్ట్రీమింగ్ కు సిద్ధం అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published May 28, 2024 | 6:23 PMUpdated May 28, 2024 | 6:23 PM
Aa Okkati Adakku OTT: ఆ ఒక్కడి అడక్కు మూవీ OTT లోకి రాబోయేది అప్పుడే.. కానీ !

ఇలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఆశ్చర్యాలు చాలానే జరుగుతున్నాయి. థియేటర్ లో సినిమాలు రిలీజ్ అయిన వారం పది రోజులకే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం ఓటీటీ లోకి రాడానికి కాస్త లేట్ అయిందని చెప్పి తీరాలి. ఎందుకంటే ఆ సినిమాతో పాటు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ.. మంచి వ్యూవర్ షిప్ దక్కించుకున్నాయి. వాటితో పోల్చుతుంటే ఇది కాస్త ఆలస్యం చేసినట్లే మరి. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఆ వివరాలేంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ మూవీస్ లిస్ట్ లో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ రప్పించేలా చెప్పుకోదగిన మూవీస్ ఏమి లేవు.. అనుకునే టైం కి.. ఇదిగో అంటూ ఓ తెలుగు సినిమా స్ట్రీమింగ్ కు సిద్ధం అయిపోతుంది. ఆ సినిమా ఏంటో ఈ స్టోరీ లైన్ చూసి గెస్ చేసేయండి. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా పెళ్లి కానీ యువత ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మ్యాట్రిమోనీ పేరిట యువత ఎలాంటి మోసాలకు గురి అవుతున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. ఇప్పటికే అందరికి ఈ సినిమా ఏంటి అనేది గుర్తొచ్చి ఉంటుంది. ఈ సినిమా మరేదో కాదు.. అల్లరి నరేష్ నటించిన ” ఆ ఒక్కటి అడక్కు” మూవీ. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా మే 3 న థియేటర్ లో భారీ అంచనాల మధ్యన రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇదే టైటిల్ తో గతంలో వచ్చిన రాజేంద్రప్రసాద్ సినిమాకు ఎలాంటి స్పందన లభించిందో తెలియనిది కాదు. దీనితో ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ కామెడీని.. అల్లరి నరేష్ నుంచి ఆశించారు ప్రేక్షకులు. కానీ థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఈ సినిమాకు ఊహించిన స్పందన లభించలేదు. ఇక ఈ సినిమా కూడా థియేట్రికల్ రన్ ను త్వరగానే పూర్తి చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ దక్కించుకున్నాయి. ఆహ ,అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇక మే 31 నుంచి ఈ సినిమా ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇన్సైడ్ టాక్. దీని గురించి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకేసారి రెండు ఓటీటీ ల్లోకి వస్తుందా లేదా కాస్త గ్యాప్ తో వస్తుందా.. అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి