iDreamPost
android-app
ios-app

నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన హిందీ సినిమాలు

  • Published Apr 02, 2024 | 12:50 PM Updated Updated Apr 02, 2024 | 12:50 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో త్రీ ఇడియట్స్, దంగల్ వంటి 9 అద్భుతమైన కొన్ని సినిమాలు థియేటర్లలో రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సూపర్ హిట్ సినిమాలనేవి వెండితెర పై మాత్రమే కాకుండా.. ఓటీటీలో ప్లాట్‌ఫారమ్‌లో కూడా సినీ ప్రియులను అలరించడానికి అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకి ఎక్కడంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో త్రీ ఇడియట్స్, దంగల్ వంటి 9 అద్భుతమైన కొన్ని సినిమాలు థియేటర్లలో రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సూపర్ హిట్ సినిమాలనేవి వెండితెర పై మాత్రమే కాకుండా.. ఓటీటీలో ప్లాట్‌ఫారమ్‌లో కూడా సినీ ప్రియులను అలరించడానికి అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకి ఎక్కడంటే..

  • Published Apr 02, 2024 | 12:50 PMUpdated Apr 02, 2024 | 12:50 PM
నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన హిందీ సినిమాలు

త్రీ ఇడియట్స్,దంగల్, తో పాటు బర్ఫీ వంటి కొన్ని అద్భుతమైన సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులకు అందించింది. ఇంతకు ముందు, ఈ సినిమాలని కేవలం వెండితెరపై మాత్రమే చూడగలిగే అవకాశం ఉండేది. అయితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చిన తర్వాత, క్లాసిక్ కంటెంట్ ఉన్న సినిమాలను మళ్లీ చూసి ఆనందించే అవకాశం సినీ ప్రేమికులకు వచ్చింది. గల్లీ బాయ్ నుండి స్వదేస్ వరకు, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్న తొమ్మిది హిందీ చిత్రాల గురించి తెలుసుకుందాం.

అంధాధున్ (2018)

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన అంధాధున్ ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, టబుతో పాటు రాధికా ఆప్టే నటించారు. 2018లో విడుదలైన ఈ సినిమా అంధుడిగా నటించే ఆకాష్ అనే పియానిస్ట్ పాత్రలో ఆయుష్మాన్ అద్భుతంగా నటించారు. అనుకోని పరిస్థితుల్లో ఆకాష్ ఒక హత్యను చూస్తాడు. దాంతో అతని జీవితం తలక్రిందులుగా మారుతుంది, కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్న ఈ చిత్రం ఓటీటీలో కూడా అంతే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

దంగల్ (2016)

అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ తో పాటు సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన దంగల్ బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రాలలో ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వం వహించగా 2016లో విడుదలైన చిత్రం ఫోగట్ సోదరీమణుల నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు, గీత, బబితలకు కుస్తీ పోటీలకై సంవత్సరాల తరబడి ఎలాంటి కఠోర శిక్షణ ఇచ్చాడు, సమాజంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కున్నాడు అనే విషయాలను చూపుతుంది. బాక్సాఫీస్ వద్ద ఆల్ టైం హిట్ గా నిలిచిన దంగల్, ఓటీటీలో కూడా మోస్ట్ పాపులర్ సినిమాగా నిలిచింది.

గల్లీ బాయ్ (2019)

జోయా అక్తర్ దర్శకత్వం వహించిన గల్లీ బాయ్ సినిమాలో రణవీర్ సింగ్, సిద్ధాంత్ చతుర్వేది, అలియా భట్, కల్కీ కోచ్లిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్ట్రీట్ రాపర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2019లో విడుదలైంది. ఈ సినిమాలో మురాద్ గా రణవీర్ సింగ్ నటన అందరి ప్రశంసలు అందించింది. ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కుని రాప్ సింగర్ గా సక్సెస్ అయ్యే ఈ జర్నీని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

బర్ఫీ (2012)

రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా జోనాస్ తో పాటు ఇలియానా డి’క్రూజ్ నటించిన బర్ఫీ ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం. 2012లో విడుదలైన బర్ఫీ, ఒక చెవిటి – మూగ అబ్బాయి కథగా తెరకెక్కింది. తొలుత శృతి అనే అమ్మాయితో ప్రేమ విఫలమైనా, మానసిక వికలాంగ అయిన జిల్మిల్‌ తో తన జీవితాన్ని ఆనందంగా పంచుకుంటాడు. రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రాల మధ్య కెమిస్ట్రీ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోమాన్స్, కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామా కూడా బాగా పండింది. అందుకే ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో చేరింది.

దిల్ చాహ్తా హై (2001)

ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం దిల్ చాహ్తా హై (2001) సినిమా బాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటి. అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ తో పాటు అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ముగ్గురు స్నేహితుల జీవితాలని, వారి ప్రేమ, స్నేహం వల్ల ఎలా ఎదిగారు అనే విషయాన్ని చూపిస్తుంది. థియేటర్లలో విడుదలై 20 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులకి ఫ్రెష్ ఫీల్ ను ఇస్తుంది.

3 ఇడియట్స్ (2009)

అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి నటించిన 3 ఇడియట్స్ సినిమా కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ప్రాణ స్నేహితులుగా మారిన ముగ్గురు యువకుల కథగా ఈ సినిమా తెరకెక్కింది. అద్భుతమైన కామెడీతో పాటు హృదయాన్ని తాకే ఎమోషన్స్, అలరించే పాటలు కలిగిన 3 ఇడియట్స్ ఓటీటీలో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది.

క్వీన్ (2013)

వికాస్ భేహల్ తెరకెక్కించిన క్వీన్ సినిమా కంగనా రనౌత్‌కు ‘క్వీన్ ఆఫ్ బాలీవుడ్’ బిరుదును తెచ్చిపెట్టింది. కంగనా రనౌత్ తో పాటు రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ చిత్రం 2013లో విడుదలైంది. రాణి అనే అమ్మాయి పెళ్ళి క్వాన్సెల్ అయి సోలో హనీమూన్‌ ట్రిప్ కోసం యూరప్‌కు వెళుతుంది. ఆ ట్రిప్ వల్ల ఆమె జీవితం ఎలాంటి మార్పులను ఎదుర్కొంది అనేదే సినిమా కథ. ఈ కామెడీ-డ్రామా చిత్రంలో కంగనా రనౌత్ తన అద్భుతమైన నటనను చూపించింది.

స్వదేస్ (2004)

షారూఖ్ ఖాన్ నటించిన స్వదేస్ సినిమా ఫారిన్ లో సెటిల్ అయిన ఒక శాస్త్రవేత్త భారత దేశ అభివృద్ధి కోసం పని చేసే కథగా తెరకెక్కింది. భారతదేశంలోని ఒక పల్లెటూరులో నివసించే తన పెంపుడు తల్లయిన కావేరీ అమ్మను కలవడానికి వస్తాడు నాసా ఉద్యోగి మోహన్‌. అయితే కావేరి అమ్మను తనతో తీసుకు వెళ్లడానికి వచ్చిన మోహన్, స్థానిక ప్రజల జీవితాల్లో తను చేయగల మార్పును అర్థం చేసుకుంటాడు. స్వదేస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా… షారుఖ్ అద్భుతమైన నటనతో పాటు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి.

దృశ్యం (2015)

మలయాళ దృశ్యం కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. అజయ్ దేవగణ్, టబు, శ్రియా శరణ్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ డ్రామా చిత్రం 2015లో విడుదలైంది. గోవాకు చెందిన విజయ్ సల్గావ్కర్, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంతటికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు. విజయ్ కి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (టబు పోషించిన పాత్ర) మధ్య జరిగే మైండ్ గేమ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.