బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్.. ఈ బుడ్డోడు చేసిన మూవీ ఏ OTTలో ఉందంటే?

Malikappuram Movie OTT Streaming Details: తాజాగా 70వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో .. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు అందుకున్న బాల నటుడు 'శ్రీపథ్'. అతనికి ఈ అవార్డ్ తీసుకొచ్చిన ఫిల్మ్ మాలికాపురం. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో ఉందో చూసేద్దాం.

Malikappuram Movie OTT Streaming Details: తాజాగా 70వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో .. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు అందుకున్న బాల నటుడు 'శ్రీపథ్'. అతనికి ఈ అవార్డ్ తీసుకొచ్చిన ఫిల్మ్ మాలికాపురం. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో ఉందో చూసేద్దాం.

సాధారణంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను దక్కించుకోవడం అనేది.. ప్రతి ఆర్టిస్ట్ కు ఉండే కల. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ అవార్డు అందరికి ప్రత్యేకమే. అయితే చిన్న పిల్లలకు ఈ అవార్డు దక్కిందంటే విశేషం అనే చెప్పి తీరాలి. ఈ క్రమంలో 2024.. 70వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో.. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా.. శ్రీపథ్ అనే అతను ఎంపిక అయ్యాడు. దీనితో అసలు శ్రీపథ్ ఎవరు.. ఏ సినిమాలలో నటించాడు. ఇప్పుడు అవార్డు వచ్చిన మూవీ ఏంటి.. ఆ మూవీని చూశామా లేదా… ఈ మూవీ ఏ ఓటీటీ లో ఉంది అని సెర్చ్ చేసేస్తున్నారు ప్రేక్షకులు.

శ్రీపథ్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన ఈ మూవీ పేరు ‘మాలికాపురం’. అసలు ఈ శ్రీపథ్ ఎవరు అనే విషయానికొస్తే.. టిక్ టాక్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయినా ఈ చిన్నోడు.. ఓ మ్యూజిక్ ఆల్బమ్, డాక్యుమెంటరీతో మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సహజంగా తనకు ఉన్న నటనా ప్రావీణ్యంతో వరుస ఆఫర్లు రావడంతో.. అందరికి బాగా నోటెడ్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ‘మాలికాపురం’ ఈ సినిమాతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ కు ఎంపికయ్యాడు. అయితే ఈ సినిమాలో అతని నటన మాత్రమే కాకుండా.. మూవీ కథ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా అద్భుతంగా ఉంటుంది. భక్తి ప్రధాన అంశంగా ఈ మూవీ కథ అంతా కూడా కొనసాగుతుంది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక మాలికాపురం సినిమా కథ విషయానికొస్తే.. షన్ను అనే ఎనిమిదేళ్ల పాప.. అయ్యప్ప స్వామి భక్తురాలు. ఆమెకు శబరిమల వెళ్లాలనే కోరిక బాగా ఉంటుంది. ఆమె తండ్రి అజయ్ కూడా తనను శబరిమల తీసుకుని వెళ్తానని మాటిస్తాడు. కానీ ఈలోపే అప్పుల బాధ తట్టుకోలేక అజయ్ సూసైడ్ చేసుకుని మరణిస్తాడు. దీనితో ఆ పాప తన క్లాస్మేట్ బుజ్జితో కలిసి శబరిమల వెళ్లాలని డిసైడ్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో షన్ను ను కిడ్నప్ చేయాలనీ ఒక రౌడీ ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు అయ్యప్పన్ అనే వ్యక్తి ఆమెను కాపాడతాడు. వారిద్దరిని శబరిమల తీసుకుని వెళ్తానని మాటిస్తాడు. అసలు అయ్యప్పన్ ఎవరు ? చెప్పినట్లుగా వారిని శబరిమల తీసుకుని వెళ్లాడా లేదా ? చివరికి కథ ఏమైంది ? అనేది మిగిలిన కథ. మరి ఈ మూవీకి ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments