iDreamPost
android-app
ios-app

OTT లోకి 7/జీ బృందావ‌న కాల‌నీ హీరోయిన్ హర్రర్ మూవీ.. అదే పేరుతో!

  • Published Aug 08, 2024 | 10:34 AM Updated Updated Aug 08, 2024 | 10:43 AM

OTT Horror Movie: హర్రర్ కథలకు మంచి క్రేజ్ నడుస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జోనర్ లో ఎంత మంది ఎన్ని సినిమాలను తీసినా కానీ ప్రతిదీ మంచి బజ్ ను సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ డ్రామా ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

OTT Horror Movie: హర్రర్ కథలకు మంచి క్రేజ్ నడుస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జోనర్ లో ఎంత మంది ఎన్ని సినిమాలను తీసినా కానీ ప్రతిదీ మంచి బజ్ ను సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ డ్రామా ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

  • Published Aug 08, 2024 | 10:34 AMUpdated Aug 08, 2024 | 10:43 AM
OTT లోకి 7/జీ బృందావ‌న కాల‌నీ హీరోయిన్  హర్రర్ మూవీ.. అదే పేరుతో!

ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే లిస్ట్ ఆల్రెడీ చూసి ఉంటారు. ఇక ఆ లిస్ట్ లో అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలు కూడా చూసే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంటే. కొన్ని సినిమాలు మాత్రం సడెన్ గా రేపే రిలీజ్ అంటూ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా 7/జీ బృందావ‌న కాల‌నీ ఫేమ్ సోనియా అగర్వాల్ నటించిన హర్రర్ సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

హర్రర్ కథలకు రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. కనీసం వారంలో ఎదో ఒక కొత్త హర్రర్ సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ కూడా ఇంట్రెస్టింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతున్న సినిమా కూడా ఇలాంటిదే. ఈ సినిమా పేరు ” 7/జీ”. 7/జీ బృందావ‌న కాల‌నీతో సినిమాతో.. సోనియా అగర్వాల్ బాగా ఫేమస్ అయినా కూడా ఆ తర్వాత ఎందుకో అంతగా సినిమాలలో రాణించలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే ఫేమ్ తో ప్రేక్షకులను మెప్పించాలని.. ఒక హర్రర్ కథతో అదే సినిమా పేరుతో వచ్చేసింది ఈ అమ్మడు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా తమిళ్ ఓటీటీ లో ఆగష్టు 9 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు మేకర్స్.

జులై మొదటి వారంలో థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. మరి ఇప్పుడు ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాజీవ్ , వర్ష అనే భార్య భర్తలు సొంతంగా ఒక ఫ్లాట్ తీసుకుంటారు. అది 7/జీ అనే ఫ్లాట్‌. వారు ఆ ఇంట్లోకి వెళ్లిన రోజు అతను ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్తాడు. దీనితో కొడుకుతో కలిసి వర్ష ఒక్కతే ఆ ఫ్లాట్ లో ఉంటుంది. ఇక అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. ఆమెకు ఆ ఇంట్లో దెయ్యం ఉందనే అనుమానం రోజు రోజుకి పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.