iDreamPost
android-app
ios-app

నేరుగా OTTలోకి 12th ఫెయిల్ హీరో మూవీ! తెలుగులో కూడా..

  • Published May 21, 2024 | 4:39 PM Updated Updated May 21, 2024 | 4:39 PM

12th Fail Hero Vikrant Massey New Movie On ott: 12త్ ఫెయిల్ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది. ఈ మూవీలో చేసిన హీరో విక్రాంత్ మాసేకి అభిమానులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు విక్రాంత్ మాసే నటించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

12th Fail Hero Vikrant Massey New Movie On ott: 12త్ ఫెయిల్ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది. ఈ మూవీలో చేసిన హీరో విక్రాంత్ మాసేకి అభిమానులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు విక్రాంత్ మాసే నటించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

  • Published May 21, 2024 | 4:39 PMUpdated May 21, 2024 | 4:39 PM
నేరుగా OTTలోకి 12th ఫెయిల్ హీరో మూవీ! తెలుగులో కూడా..

విక్రాంత్ మాసే.. మీర్జాపూర్ సిరీస్ తో ఈ బాలీవుడ్ నటుడికి పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు దక్కింది. అతని విభిన్నమైన యాక్టింగ్, కథల ఎంపిక ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. ఆ తర్వాత 12త్ ఫెయిల్ అనే బయోపిక్ చిత్రంలో నటించి అందరినీ మెప్పించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన కుర్రాడు ఐపీఎస్ అవ్వడమే కథాంశం. ఆ మూవీలో అన్ని రకాల ఎమోషన్స్ ని పలికించాల్సి ఉంటుంది. అలాంటి సినిమాలో విక్రాంత్ తన నటనతో మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు విక్రాంత్ నటించిన ఇంకో మూవీ విడుదల కాబోతోంది. అదికూడా నేరుగా ఓటీటీలోకి ఆ మూవీ రాబోతోంది. మరి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ఈ మూవీ పేరు బ్లాక్ అవుట్. విక్రాంత్ మాసే, మౌనీ రాయ్, సునీల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శశీన్ భవ్సర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ గా శశీన్ కు ఇదే మొదటి చిత్రం. తాజాగా ఈ బ్లాక్ అవుట్ మూవీ టీజర్ విడుదల చేశారు. డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా టీజర్ చూస్తే ఎంతో ప్రామిసింగా అనిపించింది. చాలా అనుభవం కలిగిన డైరెక్టర్ అనుకుంటారు. అంతేకాకుండా ఈ మూవీ టీజర్ విషయానికి వస్తే.. విక్రాంత్ మాసే మరోసారి తన నటన ఏ రేంజ్ లో ఉంటుందో చూపించాడు. ఎంతో అద్భుతంగా నటించాడు. ఈ పాత్రలో కూడా చాలా షేడ్స్ ఉంటాయనే విషయం అర్థమవుతోంది. అనుకోకుండా జరిగిన యాక్సిండెట్ కారణంగా విక్రాంత్ జీవితం పలు మలుపులు తిరుగుతుంది. తాను ఒక దొంగల వ్యానును గుద్దుతాడు. వాళ్లు భారీ దొంగతనం చేసి డబ్బు, నగలతో పారిపోతుండగా.. ఆ డబ్బు ఇతనికి దొరుకుతుంది.

నగలు దొరికిన తర్వాత తన లైఫ్ లో ఎన్నో ట్విస్టులు వెలుగు చూస్తాయి. ఫైట్లు, ఛేజింగ్లు, ఫైరింగ్ అంటూ నానా హడావుడి అవుతుంది. సునీల్ గ్రోవర్, మౌనీ రాయ్, జిషు సెంగుప్త, ఛాయాకదమ్, సౌరభ్ గడ్గే, సోనావానే వంటి స్టార్లు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఈ బ్లాక్ అవుట్ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఒక్క హిందీలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠా, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ బ్లాక్ అవుట్ మూవీ జూన్ 7 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. మరి.. విక్రాంత్ మాసే- మౌనీ రాయ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ బ్లాక్ అవుట్ మూవీ టీజర్ మీకు ఎలా అనిపించింది? మీరు ఈ బ్లాక్ అవుట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio