OTT Upcoming Crime Thriller: OTT లోకి ట్వెల్త్ ఫెయిల్ హీరో విక్రాంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

OTT లోకి ట్వెల్త్ ఫెయిల్ హీరో విక్రాంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

OTT Crime Thriller: ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు ఆదరణ బాగా లభిస్తున్న క్రమంలో.. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ను బట్టి.. మేకర్స్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాలను తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Crime Thriller: ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు ఆదరణ బాగా లభిస్తున్న క్రమంలో.. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ను బట్టి.. మేకర్స్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాలను తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ప్రతి వారం ఎదో ఒక కొత్త మూవీ లేదా సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంది. వచ్చే కథలన్నీ కూడ ఆల్రెడీ అందరికి తెలిసిన కాన్సెప్ట్స్ అయినా కూడా.. ప్రతి కథలోను ఎదో ఒక కొత్త ఎలిమెంట్ ను డిఫరెంట్ గా ప్రెసెంట్ చేస్తూ.. ప్రేక్షకులలో ఇంకాస్త ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక వీటిలో ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఓటీటీ లోకి లేటెస్ట్ గా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. మరి ఈ మూవీ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

తాజాగా ఓటీటీ లోకి రాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మరేదో కాదు.. ట్వెల్త్ ఫెయిల్ మూవీ ఫేమ్ విక్రాంత్ మ‌స్సే నటిస్తున్న “సెక్టార్ 36”. ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో విక్రాంత్ కు విశేష ఆదరణ లభించింది. ఎటువంటి అంచనాలు లేకుండా.. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా.. 70 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా చాలా వారలా పాటు ట్రెండింగ్ లోనే ఉంది. ఆ తర్వాత ఈ హీరో వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయాడు . ఇక ఇప్పుడు అదే క్రేజ్ తో విక్రాంత్ లీడ్ రోల్ లో ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ను గమనిస్తే.. ఈ మూవీలో విక్రాంత్ డబుల్ షేడ్ క్యారక్టర్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారట మేకర్స్ . కాగా ఈ సినిమాకు ఆదిత్య నింబాల్క‌ర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలోని అసలు ప్లాట్ ఏంటి అనేది.. ట్రైలర్ రిలీజ్ చేస్తే కానీ తెలియదు. కానీ సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు కూడా.. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా.. ఎంగేజింగ్ గా ఉంచుతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments