Krishna Kowshik
ఇటీవల థియేటర్లలో సందడి చేసిన హారర్ కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేసుకుంది. నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంతకు ఎక్కడ, ఎప్పటి నుండి ఈ మూవీని చూడొచ్చు అంటే..?
ఇటీవల థియేటర్లలో సందడి చేసిన హారర్ కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేసుకుంది. నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంతకు ఎక్కడ, ఎప్పటి నుండి ఈ మూవీని చూడొచ్చు అంటే..?
Krishna Kowshik
ఇటీవల థియేటర్లలో సందడి చేసి.. కడుపుబ్బా నవ్వించిన చిత్రాల్లో ఒకటి ఓం భీం బుష్. బ్రోచెవారెవురాతో కితకితలు పెట్టించిన శ్రీ విష్ణు,ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి జత కలిసి నవ్వులు పువ్వులు పూయించారు. చిన్న చిత్రంగా వచ్చి భారీ వసూళ్లను రాబట్టుకుంది. మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకుడు.. వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మించారు. ప్రీతి ముకుందన్, కామాక్షి భాస్కర్ల, ప్రియా వడ్లమాని హీరోయిన్లు. శ్రీకాంత్ అయ్యర్, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. శ్రీ విష్ణు నటన, రాహుల్ సెటెర్లు ఈ సినిమాను హిట్ ట్రాక్ పట్టించాయి.
తొలి రోజు, ఫస్ట్ షో నుండి పాజిటివ్ రివ్యూస్ రాబట్టుకుంది. హారర్ అండ్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా రిలీజ్కు ముందు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు. అనుకున్నట్లుగానే సినిమా ఆసాంతం మెప్పించింది. మంచి రివ్యూస్, రేటింగ్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. రూ. 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు, ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. 11 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ పెట్టుకుని బాక్సాఫీసు బరిలో దిగింది. శ్రీ విష్ణు కెరీర్ లోనే ఎక్కువ స్క్రీన్లపై రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా 1100 స్క్రీన్లలో విడుదలైంది. సినిమా ట్రైలరే కాదూ, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లు కూడా డిఫరెంట్‌గా చేసి ఆకట్టుకుంది చిత్ర యూనిట్.
ఈ సినిమా రిలీజై 15 రోజులు గడుస్తోంది. మొత్తంగా రూ. 15 కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుని హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ రేటు పెట్టి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఈ మూవీ ఎప్పుడు వస్తుందంటే.. ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది. అంటే రంజాన్ పండుగ పురస్కరించుకుని రాబోతుంది. ఈ లెక్కన చూస్తే.. సినిమా నెల రోజుల తిరగకుండానే వచ్చేస్తోంది. మార్చి 22న విడుదలైన ఈ చిత్రం.. కేవలం 20 రోజుల్లోనే వచ్చేస్తుండటం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం ఏప్రిల్ 12 నుండి అందుబాటులోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయండిక.